రమేష్ ఆస్పత్రిపై జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం !

గతకొద్ది రోజుల క్రితం విజయవాడ సర్ణ ప్యాలెస్‌ రమేష్ ఆస్పత్రి కోవిడ్ కేర్ సెంటర్ లో జరిగిన అగ్ని ప్రమాదం గురించి అందరికి తెలిసిందే.ఈ ప్రమాదంలో పది మంది కోవిడ్ పేషేంట్స్ మృతి చెందారు.

 Ap, Ramesh Hospital, Jagan Governament, High Court-TeluguStop.com

ఈ ఘటనలో మరికొంత మందికి గాయాలైయ్యాయి.పోలీసులు ఈ ఘటనపై విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు.

అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఇక రమేష్ ఆసుపత్రి అధినేత రమేష్ బాబు, ఆసుపత్రి ఛైర్మన్ సీతారాంమోహన్‌పై హైకోర్టు చర్యలు తీసుకోవద్దు అని ఆదేశాలను జారీ చేసింది.

అయితే ఏపీ ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.అందుకోసం పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతుందని సమాచారం.

అయితే రమేష్ క్వాష్ పిటిషన్‌ పై మంగళవారం హైకోర్టులో విచారణ చేశారు.అయితే రమేష్ ఆసుపత్రి అధినేత రమేష్ బాబుతో పాటు ఆసుపత్రి ఛైర్మన్ సీతారాంమోహన్‌పై తదుపరి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అంతేకాకుండా స్వర్ణ ప్యాలెస్‌ను క్వారంటైన్ సెంటర్‌గా అనుమతి ఇచ్చిన అధికారులను ఎందుకు బాధ్యులుగా చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది.ఇక ఈ కేసులో అధికారులను కూడా నిందితులను చేస్తారంటూ వ్యాఖ్యానించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube