బుల్లితెరపై తన కామెడీ టైమింగ్ తో సంచలనం సృష్టించిన వారిలో సుడిగాలి సుధీర్( Sudigali Sudheer ) ఒకరు.సుడిగాలి సుధీర్ కు సినిమా సినిమాకు క్రేజ్ పెరుగుతుండగా గాలోడు సినిమా కమర్షియల్ గా హిట్ గా నిలిచింది.
బుల్లితెర షోల కంటే వెండితెరకే సుధీర్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండగా సుధీర్ ఆస్తులు ఊహించని స్థాయిలో పెరిగాయని సమాచారం అందుతోంది.ఒక్కో సినిమాకు కోటి నుంచి 2 కోట్ల రూపాయల రేంజ్ లో సుడిగాలి సుధీర్ పారితోషికం ఉంది.
ప్రస్తుతం సుధీర్ గోట్ అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా సక్సెస్ సాధిస్తే సుధీర్ రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది.సుధీర్ ఆస్తుల విలువ 7 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది.
సుడిగాలి సుధీర్ ఏడాది సంపాదన 50 లక్షల రూపాయలకు అటూఇటుగా ఉందని సమాచారం అందుతోంది.సుడిగాలి సుధీర్ రేంజ్, క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
సుడిగాలి సుధీర్ ఇతర భాషలపై కూడా దృష్టి పెట్టి సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.సుడిగాలి సుధీర్ జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్( Jabardast, Extra Jabardast ) షోలలో రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సుడిగాలి సుధీర్ రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరింత ఎదగాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.సుధీర్ సినిమాలు ఇతర భాషల్లో కూడా డబ్ అవుతుండటం గమనార్హం.
సుడిగాలి సుధీర్ రష్మీ ( Sudhir Rashmi )కాంబినేషన్ లో ఒక సినిమాను ప్లాన్ చేస్తే కచ్చితంగా బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సుడిగాలి సుధీర్ సోలో హీరోగా సినిమాలు చేస్తుండగా ఇతర హీరోల సినిమలాలో కమెడియన్ గా కనిపించడానికి ఇష్టపడటం లేదు.ఈటీవీ షోలలో సుధీర్ అడపాదడపా కనిపిస్తుండగా స్వయంకృషితో సుధీర్ ఈ స్థాయికి ఎదిగి ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.సోషల్ మీడియాలో సుధీర్ కూఉహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.