ఇక్కడ లేడీ స్టూడెంట్స్ గ్యాంగ్ వార్ చూస్తే మతి పోతుంది.. బాగా ముదిరిపోయారు!

ఆడవాళ్లు బాగా అభివృద్ధి చెందుతున్నారు అంటే ఇదేనేమో! కళాశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదివి కన్నవారి కలలను నెరవేర్చాల్సిన నేటి విద్యార్థులు తప్పుతోవ పడుతున్నారు.విద్యార్థులమనే సంగతి మరచి నడిరోడ్డుపై ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.

 It's Crazy To Watch Lady Students Gang War Here ,  Girisl Fighting , Viral News-TeluguStop.com

ఇటీవల విజయవాడ ఘటన మరువకముందే ఇలాంటి సంఘటన మరొకటి చోటుచేసుకోవడం కొసమెరుపు.విషయం ఏమిటా అని కూపీ లాగితే ముక్కున వేలేసుకొనే విషయం తెలిసింది.

లవర్ కోసం కొట్టుకోవడం చూసాం.స్నేహం కోసం కొట్టుకోవడం చూసాం.

ఇలా క్లాసులో కూర్చొనే విషయంలో గడవపడేవారు బహుశా అక్కడే ఉన్నారేమో.

ఇక విషయంలోకి వెళితే, చెన్నైలో ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో ఓ రెండు గ్రూపులుగా విడిపోయి వీరకుమ్ముడు కుమ్ముకున్నారు.

ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో రెచ్చిపోయారు.బండబూతులతో నడి రోడ్డుమీదే పబ్లిక్ చూస్తుండగా పచ్చి బూతులు తిట్టుకుంటూ ఒకరిపై ఒకరు రెచ్చిపోయారు.

కేవలం క్లాసులో కూర్చొనే జాగా కోసం ఇలా ఒకరిని ఒకరు కొట్టుకోవడం స్థానికంగా పెద్ద చర్చే అయింది.రెండు మూడు రోజుల క్రితం జరుగగా తాజాగా వెలుగు చూసింది.

అమ్మాయిలమనే సంగతే మర్చిపోయి నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని మరి కొట్టుకున్నారు.పక్కనే ఉన్న మరికొందరు విద్యార్థులు ఆపే ప్రయత్నం చేసినా.

విద్యార్థినిలు వెనక్కు తగ్గలేదు సరికదా, ఒకరినొకరు దుర్భాషలాడుకుంటూ నానా హంగామా చేసారు.

Telugu Chennai, Girisl, Vijayawada-Latest News - Telugu

ఇక ఈ తతంగాన్ని అక్కడే ఉన్న స్థానికుడొకరు సెల్ ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.అది కాస్త వైరల్ అయింది.కాలేజీ స్టూడెంట్లమనే విషయాన్నే మరిచి జుట్టు పట్టుకుని నడి రోడ్డుపై ఇష్టం వచ్చినట్లు కొట్టుకున్న ఆ స్టూడెంట్స్ కి సదరు కాలేజ్ షాక్ ఇచ్చినట్టు భోగట్టా.

ఈ విషయంలో ఆ అమ్మాయిల తల్లిదండ్రులు కూడా పూర్తి రైట్స్ కాలేజ్ యాజమాన్యానికి వదిలేసారట.ఈ క్రమంలో మొదట అందరిని డిబార్ చేయవలసిన యాజమాన్యం వారి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని తీవ్రమైన హెచ్చరికల నడుమ వారిని వదిలేసినట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube