పూజా హెగ్డేను వెంటాడుతున్న ఐరన్ లెగ్ సెంటిమెంట్?

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఒక లైలా కోసం అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న పూజా హెగ్డే అనంతరం పలు సినిమాలలో నటిస్తూ పర్వాలేదనిపించారు.అయితే కెరీర్ మొదట్లో ఈమె నటించిన సినిమాలు అనుకున్న స్థాయిలో హిట్ కాకపోవడంతో ఈమెకు ఏ విధమైనటువంటి క్రేజ్ తగ్గలేదు.

 Iron Leg Sentiment Haunting Pooja Hegde , Pooja Hegde, Iron Leg ,janaganamana Mo-TeluguStop.com

అనంతరం ఈమె నటించిన సినిమాలు ప్లాప్ కావడంతో ఇండస్ట్రీలో పూజా హెగ్డే పై ఐరన్ లెగ్ అనే ముద్ర వేశారు.ఇలా ఐరన్ లెగ్ అనే ముద్ర పడటంతో ఈమెతో సినిమాలు చేయడానికి కూడా పెద్దగా నిర్మాతలు ఇష్టపడేవారు కాదు.

ఇక ఇండస్ట్రీలో పూజ హెగ్డే పని అయిపోయింది అనుకునే క్రమంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈమెలో టాలెంట్ గుర్తించి తనకు అరవింద సమేత సినిమాలో నటించే అవకాశం కల్పించారు.ఈ సినిమా హిట్ కావడంతో అనంతరం అలా వైకుంఠపురం, మహర్షి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి సినిమాల ద్వారా తన నటనను బయట పెట్టడంతో ఈమె ఇండస్ట్రీలో అగ్రతారగా పేరు సంపాదించుకున్నారు.

ఇటీవల కాలంలో ఈమె నటించిన మూడు సినిమాలు ఫ్లాప్ కావడంతో మరోసారి ఐరన్ లెగ్ అనే సెంటిమెంట్ తనని వెంటాడుతుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినపడుతున్నాయి.

Telugu Iron Leg, Janaganamana, Liger, Mahesh Babu, Pooja Hegde-Movie

పూజా హెగ్డే ఐరన్ లెగ్ ప్రభావంతోనే ఏకంగా ఈమె నటిస్తున్నటువంటి జనగణమన సినిమా షూటింగ్ ఆగిపోయిందని వార్తలు వినపడుతున్నాయి.లైగర్ సినిమా ప్రభావంతో ,ఈ సినిమా కలెక్షన్లను చూసిన జనగణమన సినిమా నిర్మాతలు సినిమా నుంచి పక్కకు తప్పుకోవడంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది అని తెలుస్తోంది.ఇక పూజ హెగ్డే నటించిన మూడు సినిమాలు ఫ్లాప్ అవ్వడమే కాకుండా తాను కమిట్ అయిన సినిమా కూడా ఆగిపోవడంతో తనని మరోసారి ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.

అయితే ఈమె మరోసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో కూడా నటిస్తున్నారు.మరి ఈ సినిమాతో అయినా ఈమె హిట్ కొట్టి తాను ఐరన్ లెగ్ కాదని నిరూపించుకుంటారా లేదంటే ఈ సినిమా కూడా ఫ్లాప్ జాబితాలోకి వెళ్తుందా అనే విషయం తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube