ప్రపంచ దేశాల నుంచీ వలస కార్మికులుగా అత్యధిక శాతం మంది వలసలు వెళ్ళేది అరబ్బు దేశాలకే.ఈ అరబ్బు దేశాలలో కువైట్ కే ప్రవాసులు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు.
ఎందుకంటే అక్కడ జీత భత్యాలు ఎక్కువగా ఉండటంతో పాటు అక్కడి కరెన్సీ విలువ ఎక్కువ.అయితే ప్రస్తుతం వలస వాసులపై కటినమైన నిర్ణయాలు తీసుకుంటూ భవిష్యత్తులో అక్కడికి వెళ్ళడం దండగ అనుకునేలా నిభందనలు విధిస్తూ ప్రవాసుల ఎంట్రీకి బ్రేక్ వేసేలా చర్యలు చేపడుతున్న కువైట్ అక్కడ పనిచేసే ప్రవాస కార్మికులకు వారి జీత భత్యాల విషయంలో వారి యజమానులు ఎలాంటి మోసాలకు పాల్పడకుండా కటినమైన చర్యలు తీసుకునేలా ప్రణాళిక రూపొందించింది.
అరబ్బు దేశాలలో ఉద్యోగాలకు వెళ్ళారంటే దాదాపు 80 శాతం మంది కార్మికులుగానే వెళ్తారు.అక్కడి యజమానుల ఇళ్ళలో పనికి లేదంటే ఫ్యాక్టరీలలో వర్కర్స్ గా పనిచేస్తుంటారు.గొడ్డు చాకిరీ చేయించుకుని జీతాలు సరిగా ఇవ్వక పోగా శారీరకంగా ఇబ్బందులకు గురిచేసే యజమానులు కూడా ఉంటారు.అంతేకాదు యజమానుల పైశాచికత్వానికి మృతి చెందిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.
అయితే ఇలాంటి ఘటనలు జరుగకుండా ప్రవాసులకు ఎలాంటి నష్టం జరుగకుండా ఉండేందుకు సరికొత్త చట్టం తీసుకువస్తోంది అక్కడి ప్రభుత్వం.
కువైట్ వెళ్లి నష్టపోయాము అనే అపనిందలు తమపై పడకూడదని, ఈ నిందలకు కారణమయ్యే యజమాన్యాలపై తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది.
ఇకపై కువైట్ లో పనిచేసే ప్రతీ ప్రవాసుడు తప్పనిసరిగా వేలి ముద్రలు వేయాలని నిభందన విధించింది.ఈ వేలి ముద్రల ద్వారా అతడికి సకాలంలో జీతం అందుతోందా లేదా అనేది తెలుస్కోవచ్చునని, ఒక వేళ ప్రవాసులు దేశం విడిచి వెళ్ళిపోయినా అతడికి రావాల్సిన మొత్తం జీతం వచ్చిందో లేదో కూడా తెలిసి పోతుందని అంతేకాదు అతడు ఉద్యోగంలో చేరే ముందు కుదురుచుకున్న అన్ని ఒప్పందాలు సౌకర్యాలు యజమాని నిర్వహించాడా లేదా అనేది కూడా సరికొత్త విధానంలో తెలుస్తుందని ప్రభుత్వం తెలిపింది.
ఒక వేళ యజమాని ఎలాంటి నిభందనను పాటించక పోయినా సరే వారిపై కటినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.