ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.టర్మినల్ 3 వద్ద సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు సీఐఎస్ఎఫ్ అధికారులకు చిక్కాడు.
ఎవరూ గుర్తుపట్టలేని విధంగా స్వీట్ బాక్సులోని ఓ లేయర్ కింద విదేశీ కరెన్సీ నోట్లను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు.పట్టుబడిన సౌదీ కరెన్సీ విలువ సుమారు రూ.54 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.







