దుబాయ్ లో ఐపీఎల్ 2024 మినీ వేలం జరుగుతోంది.ఈ మేరకు దుబాయ్ వేదికగా ఫ్రాంఛైజీలు మినీవేలం ప్రక్రియను నిర్వహించారు.
ఇందులో మొత్తం 333 మంది ఆటగాళ్లు అమ్మకానికి ఉన్నారన్న సంగతి తెలిసిందే.
మినీ వేలంలో భాగంగా ఆర్.పావెల్ ను రాజస్థాన్ రూ.7.40 కోట్లకు కొనుగోలు చేసింది.హ్యారీ బ్రూక్ ను ఢిల్లీ రూ.4 కోట్లకు దక్కించుకుంది.ట్రావిస్ హెడ్ ను రూ.6.80 కోట్లకు హైదరాబాద్ కొనుగోలు చేసింది.
వేలానికి ఎంపికైన మొత్తం 333 మంది ఆటగాళ్లలో 214 మంది భారతీయులు ఉండగా 119 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.కాగా అన్ని ఫ్రాంచైజీల వద్ద మొత్తం రూ.262.95 కోట్లు ఉన్నాయి.ఈ మినీ వేలంలో పది ఫ్రాంచైజీలు తమ స్క్వాడ్ లలో ఖాళీగా ఉన్న స్లాట్ లను పూరించడానికి పోటీ పడుతున్నారు.