శ్రీవిష్ణు సినిమాలు చూస్తున్నంత సేపు దాదాపుగా అందరికీ వారి చుట్టు పక్కల ఉన్న సాధారణ, మధ్యతరగతి కుర్రాడు ఎలా ఉంటాడో అలా ఉంటాడన్న ఫీలింగ్ వచ్చేస్తుంది.అయితే, శ్రీవిష్ణు నటించిన చిత్రాలు ప్రేక్షకులకు బాగానే నచ్చుతున్నాయి.
కానీ, బాక్సాఫీసు వద్ద సత్తా చాటాలేకపోతున్నాయి.ఈ క్రమంలోనే సూపర్ హిట్ ఫిల్మ్ కోసం శ్రీవిష్ణు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు.
శ్రీవిష్ణు తను నటించే సినిమాల టైటిల్స్ డిఫరెంట్ అండ్ క్రేజీగా ఉండేలా ప్లాన్ చేసుకుంటాడట.ఎందుకంటే టైటిటల్ క్రేజీగా ఉంటే ఆటోమేటిక్‌గా మూవీ ప్రమోషన్స్ జరిగిపోతాయని నమ్మకం.
టైటిల్ క్యాచీగా ఉంటే అందులో ఏదో ఉంటుందోనని ఆడియన్స్ సినిమా థియేటర్స్ వద్దకు వచ్చి తమ సినిమా చూస్తారని మేకర్స్ నమ్మకం.శ్రీవిష్ణు నటించిన సినిమాలన్ని కూడా ఇప్పటి వరకు దాదాపుగా ఈజీ గోయింగ్, కామెడి, ఎంటర్‌టైనర్స్.
కాగా, ఈ సారి ఫుల్ సీరియస్ డ్రామాలో నటించబోతున్నాడు.ఆ సినిమా పేరు ‘అర్జున-ఫల్గుణ’.
ఈ టైటిల్ గురించి తెలుసుకని ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఈ సారి సినిమా హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే శ్రీవిష్ణు నటించిన సినిమాలు ఇటీవల కాలంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అంతగా ఆకట్టుకోలేకపోయాయి.‘గాలి సంపత్’ కొవిడ్ టైంలో ఓటీటీ వేదికగా విడుదలై శ్రీవిష్ణు గాలి తీసేసింది.ఇక ఆ తర్వాత ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో వచ్చిన ‘రాజరాజ చోర’ ఫిల్మ్ విడుదలైంది.ఈ సినిమాప్రేక్షకులకు బాగానే నచ్చింది.కానీ, బాక్సాఫీసు వద్ద అనుకన్న స్థాయిలో ఆడలేకపోయిది.

దాంతో ఈ సారి వచ్చే ‘అర్జున-ఫల్గుణ’ ఫిల్మ్ కంపల్సరీగా హిట్ అవుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.గతంతో శ్రీవిష్ణు నటించిన సినిమాలకూ వెరీ ఇంట్రెస్టింగ్ టైటిల్స్ ఉన్నాయి ‘తిప్పరా మీసం, బ్రోచెవారెవరురా, వీర భోగ వసంతరాయలు, నీది నాది ఒకే కథ, మెంటల్ మదిలో’ చిత్రాలు డిఫరెంట్ అండ్ క్రేజీ టైటిల్స్ కావడంతో ఇవి యూత్‌ను బాగా అట్రాక్ట్ చేస్తాయి.