తాజాగా దుబాయ్ లో సైమా 2023 వేడుకలు ఎంతో ఘనంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ వేడుకలలో భాగంగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో అవార్డులు వచ్చాయి.
ఈ క్రమంలోనే ఉత్తమ నటుడిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) అవార్డును అందుకున్నారు కొమరం భీం పాత్రలో నటించిన అవార్డు రావడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈయన ఇదివరకు ఈ అవార్డును జనతా గ్యారేజ్ సినిమాకు గాను ఉత్తమ హీరోగా అవార్డుగా గెలుపొందారు.
చిత్ర పరిశ్రమలు ఎన్టీఆర్ ఇలా సక్సెస్ అందుకోవడానికి కారణం ఏమిటి ఆయన వెనుక ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఎవరు అనే విషయానికి వస్తే.
ఎన్టీఆర్ నందమూరి హరికృష్ణ ( Harikrishna ) శాలిని దంపతులకు జన్మించిన కుమారుడు అనే విషయం మనకు తెలిసిందే ఇక ఎన్టీఆర్ హరికృష్ణ రెండవ భార్య కుమారుడు దీంతో నందమూరి కుటుంబం ఈ ఫ్యామిలీని కాస్త దూరం పెట్టినప్పటికీ హరికృష్ణ మాత్రం ఒక భర్తగా తండ్రిగా వారి బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తించారు.అంతేకాకుండా ఎన్టీఆర్ కి కూడా ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు.ఇక హరికృష్ణ ఎన్టీఆర్ ను తీసుకొని షూటింగ్లకు వెళ్లగా ఎన్టీరామారావు కూడా ఆయనను చాలా దగ్గరకు తీసుకొని తన పేరును నందమూరి తారక రామారావుగా మార్చారు.
ఇదే విషయాన్ని పలు సందర్భాలలో ఎన్టీఆర్ హరికృష్ణ కూడా తెలియజేశారు.
ఇక హరికృష్ణ సినిమాలు రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల ఎన్టీఆర్ ఎక్కువగా తన తల్లి శాలిని( Shalini ) తోనే అనుబంధం పెంచుకున్నారు.అయితే తన తల్లి ఎన్టీఆర్ ను నిజజీవితంలో ఎప్పుడూ కూడా ఊహలలో బ్రతకనివ్వలేదు నిజజీవితంలో వాస్తవంలోనే బ్రతకాలని, మంచి చెడులను తనకు నేర్పించింది అంటూ తారక్ తెలియజేశారు.ఇలా ఇండస్ట్రీలో తారక్ ఇంత మంచి గొప్ప స్థానంలో ఉండటానికి ఆయన నడవడిక వ్యక్తిత్వం మాటతీరు పెద్దలకు గౌరవం ఇచ్చే విధానం అన్ని కూడా తన తల్లి శాలిని గారి నుంచే నేర్చుకున్నారని ఆమె నేర్పిన విద్యాబుద్ధిలే ఎన్టీఆర్ ను ఈ స్థాయిలో నిలబెట్టాయని ఎన్టీఆర్ ఈ స్థాయికి రావడానికి తన తల్లి తనకు బలం బలగం అంటూ పలు సందర్భాలలో ఈ విషయాలను వెల్లడించారు.