శ్యామ్‌‌సింగరాయ్ విలన్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని తాజాగా నటించిన చిత్రం శ్యామ్‌‌ సింగరాయ్.ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయంలో నటించగా, కృతి శెట్టి, సాయి పల్లవి హీరోయిన్ గా నటించారు.

 Interesting Facts About Shyam Singha Roy Villain Manish Wadhwa Details,  Shyam S-TeluguStop.com

ఈ సినిమాకు దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.పునర్జన్మ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ సినిమా డిసెంబర్ 24న విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ను అందుకుంది.ఇక ఈ సినిమాలో నటించిన నటీనటుల నటనకు గాను మంచి మార్కులే పడ్డాయి.

ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతోంది.ఇక ఇందులో మహంత్ అనే విలన్ పాత్రలో మనీష్ వాధ్వా నటించిన విషయం తేలిసిందే.

ఈ సినిమాలో మనీష్ కనిపించేది కొద్దీసేపు అయినప్పటికీ అతని పాత్ర చాలా గంబీరంగా ఉంటుంది.మనీష్ విషయానికి వస్తే ఇతను 1972 లో ముంబై లో జన్మించాడు.

మొదట డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తన కెరిర్ ని మొదలు పెట్టాడు.ఆ తర్వాత బుల్లితెర నటుడిగా మారాడు.

మనీష్ వాద్వా ఎక్కువగా చాణక్యుడు పాత్రలలో ఫేమస్ అయ్యాడు.

చాణక్య పాత్రలకు మనీష్ ఎంతలా సూట్ అవుతాడు అంటే ఆ పాత్రలో మనీష్ ని తప్ప వేరొకరిని ఊహించుకోలేము అంతలా ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి అద్భుతంగా నటిస్తాడు.

Telugu Artist, Krithi Shetty, Manish Wadhwa, Nani, Sai Pallavi, Shyamsingha, Tol

చంద్రగుప్తమౌర్య, పద్మవాతార్ శ్రీ కృష్ణ వంటి సీరియల్స్ లో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.అదే విధంగా బాలీవుడ్ లో మణికర్ణిక, పద్మవత్ లాంటి సినిమాల్లో కూడా నటించాడు.ఇక శ్యామ్ సింగరాయ్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.ఇక ఒక ఇంటర్వ్యూలో మనీష్ మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో పని చేయాలి అనేది తన కోరిక అని తెలిపాడు.

ఇక శ్యామ్ సింగరాయ్ సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడే మరొక సినిమా అవకాశం వచ్చింది అని ఆ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని చెప్పుకొచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube