టెక్నాలజీ అభివృద్ధి చెంది మొబైల్స్, డిజిటల్ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి.సెల్ఫీ అంటే ఇష్టపడేవారు ఎప్పటికప్పుడు సెల్ఫీలు దిగుతూ డిజిటల్ రూపంలో వాటిని భద్రపరచుకుంటున్నారు.
కానీ ఇన్ స్టాంట్ ఫోటో కాపీ ఇష్టపడని వారంటూ ఉండరు.పైగా ఇష్టపడి కెమెరాలను కొనుక్కుంటున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో బెస్ట్ ఇన్ స్టాంట్ ఫోటో కెమెరా గురించి తెలుసుకుందాం.
Instax Mini 12 Blue EX D అనే కెమెరా ను క్లిక్ చేయగానే ఫోటో వచ్చేస్తుంది.ఈ కెమెరాను జపాన్( Japan ) కు చెందిన Fujifilm కంపెనీ ప్రత్యేక ఫీచర్లతో తయారు చేసి మార్కెట్లోకి తెచ్చింది.ఈ కెమెరా 5 రకాల రంగులలో అందుబాటులో ఉంటుంది.ఈ కెమెరా (Instax Mini 12 Blue EX D )పొడవు 10.4 సెంటీమీటర్లు, వెడల్పు 12.2 సెంటీమీటర్లు, ఎత్తు 6.6 సెంటీమీటర్లు ఉంటుంది.ఈ కెమెరా బరువు 306 గ్రాములు.ఈ కెమెరాలో రెండు ఆల్క లైన్ బ్యాటరీలు ఉంటాయి.కావాలంటే వీటికి బదులు రీఛార్జ్ చేసుకునే బ్యాటరీలు( Batteries ) కూడా వేసుకునే అవకాశం ఉంది.
ఫోటోలు డిజిటల్ రూపంలో కాకుండా కాపీ కావాలంటే కచ్చితంగా స్టూడియో కు వెళ్లాల్సిందే. కానీ ఈ కెమెరాతో వెంటనే ఫోటో కాపీ పొందవచ్చు.ఇకపై ఫోటో స్టూడియో కు వెళ్లాల్సిన అవసరం ఉండదు.
ఈ కెమెరాతో ఫస్ట్ దిగిన ఫోటో ఎలా ఉందో చూసి బాగా లేకపోతే మరొక ఫోటో తీసుకోవచ్చు.కాబట్టి మొదటి ఫోటో బ్లాంక్ కాపీ వస్తుంది.ఆ తర్వాత ఫోటోలు బ్యూటిఫుల్, కలర్ ఫుల్ గా బయటకి వస్తాయి.ఈ కెమెరాతో తీసిన ఫోటోలు చాలా బ్రైట్ గా రావడంతో పాటు సెల్ఫీలు తీసుకోవడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది.ఈ కెమెరా ధర రూ.9,499 గా ఉంది.కానీ అమెజాన్ లో దీనిపై 26% డిస్కౌంట్ ఉండడంతో రూ.6,997 కి సెల్ఫీ ప్రియులు సొంతం చేసుకోవచ్చు.