అమెరికాలో ట్రిపుల్ మర్డర్ కేసు.. 23 ఏళ్ల భారతీయ విద్యార్ధి, మిస్టరీ ఛేదించే పనిలో పోలీసులు

ట్రిపుల్ మర్డర్ కేసులో 23 ఏళ్ల భారతీయ విద్యార్ధిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు.న్యూజెర్సీ కండోమినియంలో( New Jersey Condominium ) తన గ్రాండ్ పేరెంట్స్, మేనమామను నిందితుడు హత్య చేసినట్లు పోలీసులు అభియోగాలు మోపారు.

 Indian Student Charged With Family Members Triple Murder In Us Details, Indian S-TeluguStop.com

నిందితుడిని ఓం బ్రహ్మభట్‌గా( Om Brahmbhatt ) గుర్తించారు.ఇతను దిలీప్ కుమార్ బ్రహ్మభట్ (72), బిందు బ్రహ్మభట్ (72), యష్ కుమార్ బ్రహ్మభట్ (38)లను హత్య చేసినట్లు సౌత్ ప్లెయిన్‌ఫీల్డ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అండ్ మిడిల్‌సెక్స్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

సోమవారం ఉదయం 9 గంటలకు సౌత్ ప్లెయిన్‌ఫీల్డ్‌లోని( South Plainfield ) న్యూ డర్హామ్ రోడ్‌ కొప్పోలా డ్రైవ్‌లోని ఇంటికి చేరుకున్న అధికారులకు ట్రెడిషన్స్ కాండో కాంప్లెక్స్‌లో( Traditions Condo Complex ) కాల్పులు జరిగినట్లు పొరుగువారు తెలిపారు.ఇంటి లోపలికి ప్రవేశించిన అధికారులు ముగ్గురు వ్యక్తులు తుపాకీ గాయాలతో పడివుండటాన్ని గమనించారు.

వెంటనే దిలీప్ కుమార్, బిందు వారి కుమారుడు యష్ కుమార్‌లను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు పోలీసులు.అయితే అప్పటికే వారు మరణించినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు.ఘటనాస్థలిలోనే నిందితుడు ఓం బ్రహ్మభట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

Telugu Bindu, Indian, Om Brahmbhatt, Plainfield, Condo Complex, Triple, Yashkuma

అతనిపై ఫస్ట్ డిగ్రీ మర్డర్, సెకండ్ డిగ్రీ ఆయుధాలను కలిగి వున్నట్లుగా మూడు అభియోగాలు మోపారు.గుజరాత్‌కు( Gujarat ) చెందిన ఓం.మృతులతో కలిసి అదే ఇంట్లో నివసిస్తున్నట్లుగా గుర్తించారు.నిందితుడు రెండు నెలల క్రితమే న్యూజెర్సీకి( New Jersey ) వచ్చినట్లుగా ఎన్‌బీసీ న్యూయార్క్ నివేదించింది.విచారణకు ముందు అతనిని మిడిల్ సెక్స్ కౌంటీ అడల్ట్ కరెక్షనల్ సెంటర్‌కు తీసుకెళ్లారు అధికారులు.

అయితే ఓం బ్రహ్మభట్ తరపున న్యాయవాది వున్నారా లేదా అన్నది తెలియరాలేదు.

Telugu Bindu, Indian, Om Brahmbhatt, Plainfield, Condo Complex, Triple, Yashkuma

కాల్పులకు దారి తీసిన కారణాలు తెలియాల్సి వుంది.భారత్ నుంచి వచ్చిన అనేక కుటుంబాలకు ట్రెడిషన్స్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ నిలయం.భద్రత దృష్ట్యా ఇక్కడ డజన్ల కొద్దీ కెమెరాలు అమర్చబడి వుంటాయి.

ఈ సీసీటీవీ ఫుటేజ్ పోలీసులకు ఉపయోగపడే అవకాశాలు వున్నాయి.సౌత్ ప్లెయిన్‌ఫీల్డ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ నేతృత్వంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

కాల్పులకు సంబంధించి ఏదైనా సమాచారం వుంటే పోలీసులకు గానీ మిడిల్‌సెక్స్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయాన్ని కానీ సంప్రదించాలని అధికారులు సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube