భారత సంతతికి చెందిన బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్( Rishi Sunak ) వచ్చే వారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ కానున్నారు.గుడ్ ఫ్రైడే శాంతి ఒప్పందం 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రిషి సునాక్ నార్త్ ఐర్లాండ్‌లో జో బైడెన్‌ను కలుస్తారు.1998 నాటి ఈ ఒప్పందంలో అమెరికా మధ్యవర్తిగా వ్యవహరించడం ద్వారా ఉత్తర ఐర్లాండ్ రాజకీయాల్లో ప్రభావంతమైన వాయిస్‌గా నిలిచింది.అంతేకాకుండా యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం వల్ల ఏర్పడే పరిణామాల నేపథ్యంలో ఈ ప్రాంతంలో శాంతిని నిలబెట్టడానికి అగ్ర రాజ్యం ప్రయత్నించింది.
ప్రస్తుతం నార్త్ ఐర్లాండ్‌లో ( Northern Ireland )రాజకీయ అనిశ్చితి ఎక్కువగా వున్న సమయంలో జో బైడెన్ రానుండటం ప్రాధాన్యత కలిగిస్తోంది.మంగళవారం సాయంత్రం ఇరు దేశాధినేతలు భేటీకానున్నారు.
బైడెన్( Biden ) గౌరవార్ధం సునాక్ ఓ విందును ఇస్తారని బ్రిటీష్ ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.తన ఐరిష్ మూలాల గురించి తరచూ గర్వంగా మాట్లాడే జో బైడెన్.
డబ్లిన్‌లోని తన పూర్వీకుల ఇళ్లను సందర్శిస్తారని సమాచారం.

ఇకపోతే.1998, ఏప్రిల్ 10న గుడ్‌ఫ్రైడే ఒప్పందంపై సంతకాలు జరిగాయి.1960వ దశకం నుంచి ఉత్తర ఐర్లాండ్‌ను కుదిపేసిన మతపరమైన రక్తపాతానికి ఈ ఒప్పందం ముగింపు పలికింది.అయితే ఉత్తర ఐర్లాండ్‌లోని డెమొక్రాటిక్ యూనియనిస్ట్ పార్టీ బ్రెగ్జిట్ అనంతర వాణిజ్య నిబంధనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇదిలావుండగా నార్త్ ఐర్లాండ్‌లో దేశీయ ఉగ్రవాదం తారాస్థాయికి చేరిందని బ్రిటన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎంఐ5( Britain’s intelligence agency MI5 ) మార్చిలో హెచ్చరించింది.

ఇదే సమయంలో బ్రెగ్జిట్ విషయంలో బైడెన్ కొన్ని విషయాలకు సంబంధించి బ్రిటీష్ ప్రభుత్వంతో విభేదించారు.అయితే తాజాగా బ్రెగ్జిట్ ఒప్పందం వల్ల ఏర్పడిన కొన్ని ఉద్రిక్తతలను పరిష్కరించడానికి రూపొందించిన యూకే-ఈయూ ఒప్పందానికి మద్ధతుగా అమెరికా అధ్యక్షుడు మాట్లాడారు.ఈ ఒప్పందం నార్త్ ఐర్లాండ్‌లో ప్రభుత్వాన్ని పునరుద్ధరించడంలో విఫలమైంది.కానీ అంతర్జాతీయ పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఒక శిఖరాగ్ర సమావేశాన్ని ప్రకటించడం ద్వారా సునాక్ .ఈ ప్రావిన్స్‌కు తాను అండగా వున్నట్లు రుజువు చేసినట్లయ్యింది.ఏది ఏమైనప్పటికీ జో బైడెన్-రిషి సునాక్‌ల కలయిక యూరప్‌తో పాటు అంతర్జాతీయంగా ప్రాధాన్యత కలిగిస్తోంది.
