మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో భారత సంతతికి చెందిన వైద్యుడికి యూకే క్రిమినల్ కోర్టు రెండు యావజ్జీవ కారాగార శిక్షలు విధించింది.తూర్పు లండన్‌లోని తన క్లినిక్‌లో నలుగురు మహిళలు సహా 25 మందిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసుకు సంబంధించి 53 ఏళ్ల మనీష్ షా దోషిగా తేలాడు.
ఇతను గతంలో 90 నేరాలకు సంబంధించి ఇప్పటికే మూడు జీవిత ఖైదులను అనుభవిస్తున్నాడు.తాజా శిక్షలు మునుపటి శిక్షలతో సమానంగా అమలు చేయబడతాయని యూకే మీడియా తెలిపింది.
15 నుంచి 34 ఏళ్ల మధ్య వయసున్న 28 మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన షా.మొత్తం 115 నేరాల్లో దోషిగా తేలాడు.2009 నుంచి నాలుగేళ్లలో తన లైంగిక కోరికలను తీర్చేందుకు అవసరమైన పరీక్షలు చేయించుకునేలా మహిళా రోగులను ఒప్పించేందుకు షా ప్రయత్నించాడు.ఇందుకోసం హై ప్రొఫెల్ కేసులను ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది.
అతనికి తీర్పు విధిస్తూ.సెంట్రల్ క్రిమినల్ కోర్టు జడ్జి పీటర్ రూక్ ఇలా అన్నారు.
షా మహిళలకు ప్రమాదంగా మిగిలిపోయాడని, అతని వల్ల బాధితులకు దీర్ఘకాలిక మానసిక నష్టం కలిగించిందని ఆయన వ్యాఖ్యానించారు.
గతేడాది డిసెంబర్‌లో జరిగిన విచారణ సందర్భంగా.అదనపు పరీక్షలు నిర్వహించడం ద్వారా తన రోగులకు తాను మంచి వైద్యుడిగా నమ్మకం కలిగించేందుకు షా ప్రయత్నించినట్లు కోర్టు దృష్టికి వచ్చింది.అయితే ప్రాసిక్యూటర్ రీల్ కార్మీ- జోన్స్ కేసీలు మనీష్ షా మహిళలను ఏ విధంగా మానిప్యులేట్ చేసిందో వివరించారు.ఇకపోతే.2020లో మహిళా రోగులపై 90 సార్లు లైంగిక దాడులకు పాల్పడినందుకు గాను మనీష్ షాకు కోర్ట్ మూడు జీవిత ఖైదులు విధించిన సంగతి తెలిసిందే.
ఇక భారత సంతతికే చెందిన కృష్ణ సింగ్ అనే వైద్యుడు కూడా తన దగ్గరకు వచ్చే మహిళా రోగులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన అప్పట్లో కలకలం రేపింది.1983 నుంచి 2018 వరకు 35 ఏళ్లలో 48 మంది మహిళలను అతను లైంగికంగా వేధించినట్లు తేలింది.మహిళలకు ముద్దు పెట్టడం, అసభ్యంగా తాకడం, అవసరం లేని టెస్టులు చేయడం వంటి పనులకు కృష్ణసింగ్ పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.విచారణ సమయంలో సింగ్‌పై 60కి పైగా అభియోగాలు మోపబడగా.
వీటిలో 54 అభియోగాల్లో కృష్ణసింగ్ దోషిగా తేలాడు.