చాలా చాలా అర్జెంటు గా తెలుగు సినిమాకు ఒక నలుగురు లేదా ఐదుగురు హీరోయిన్స్ కావలి.అది కూడా తక్కువ బడ్జెట్ లో.
ఎందుకంటే ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్స్ కొరత బాగా పెరిగింది కాబట్టి.అదేంటండి తెలుగు ఏటా ఇంత మంది కొత్త వాళ్ళు, స్టార్ హీరోయిన్స్ వస్తున్నారు ఇంకా హీరోయిన్స్ కొరత ఏంటి అని కదా మీ సందేహం.
అదే ఇప్పుడు తీరుస్తాను.నిన్న మొన్నటి వరకు రష్మిక వర్సెస్ పూజా హెగ్డే అని బాగా వినిపించింది.రష్మిక ఇప్పుడు తెలుగు లో చేయడం కష్టం .పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది.పైగా ఆరు కోట్లు డిమాండ్ చేస్తుంది.హిందీ మరియు తమిళ్ లో మంచి మార్కెట్ ఉంది.
వరస ఫ్లాపులు ఉన్నాయి కాబట్టి పూజ కి మార్కెట్ లేనట్టే పైగా ఆమె తెలుగు ని నాన్ ప్రియారిటీ లో పెట్టింది అని వినికిడి.సీనియర్స్ అయినా అనుష్క, తమన్నా, కాజల్ ని ఎవరు పట్టించుకోవడం లేదు.వీళ్ళు ఇంకా వెటరన్ జాబితాలో ఉన్నట్టే అనుకోండి.సీతారామం హీరోయిన్ తెలుగు లో చేసింది ఒకే ఒక్క సినిమా పైగా కోటి అడుగుతుంది అంట.అందుకే ఆమె గురించి మన తెలుగు వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు.ప్రస్తుతానికి సాయి పల్లవి లాంటి క్రేజీ హీరోయిన్ రెండు ఫలపులకు బయపడి అవుట్ ఆఫ్ ద రీచ్ అయిపొయింది.
జనాలు ఎప్పుడో మర్చిపోయిన శృతి హాసన్ ని సీనియర్ హీరోలు చిరు, బాలయ్య లైన్ లో పెట్టిన ఆమెను కుర్ర హీరోలు ఇంకా తమ సినిమాల్లో పెట్టుకోరు కాక పెట్టుకోరు.ప్రశాంత్ నీల్ వంటి డైరెక్టర్ జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ ని ట్రై చేస్తున్నాడు .ఆమె చెప్పిన రేటు చూసి ప్రొడ్యూసర్ గుండె పట్టుకున్నాడు.చేసినవి కేవలం మూడు సినిమాలు పైగా నటన కూడా రాదు.
శ్రీదేవి కూతురు అనే పేరు తప్ప ఆమెను ఎందుకు పెట్టుకోవాలో ఎవరికీ క్లారిటీ లేదు.
కుర్ర కుమారి శ్రీ లీల మరియు 18 పేజెస్ అనుపమ పరమేశ్వరన్ మినహా ఎవరు కూడా మన రేంజ్ లో లేకపోవడం గమనార్హం.అందుకే ఇలాంటి ఇంకొంత మంది కుర్ర హీరోయిన్స్ యమ అర్జెంటు గా తెలుగు ఇండస్ట్రీ కి అవసరం ఉంది.డ్యాన్సులు, నటన వచ్చి ఉండాలి సుమా!