సొంత అల్లుడిపై కత్తితో దాడి.. కటకటాల వెనక్కి మామ,యూకేలో భారతీయుడి ఘాతుకం

అల్లుడిపై కత్తితో దాడి చేసిన మామకు బ్రిటన్ కోర్ట్ ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది.ఈ మేరకు స్థానిక మీడియా కథనాలను ప్రసారం చేసింది.

 Indian-origin Man Jailed In Uk For Attacking Son-in-law Details, Indian-origin M-TeluguStop.com

నిందితుడిని భజన్ సింగ్‌గా గుర్తించారు.ఇతను హ్యాండ్స్‌వర్త్‌లోని కార్న్‌వాల్ రోడ్ హోమ్‌లో అల్లుడు, కుమార్తె,వారి ఇద్దరు పిల్లలతో కలిసి వుంటున్నాడు.

ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో చికెన్ కట్ చేసే కత్తితో అల్లుడిపై దాడికి దిగినట్లు బర్మింగ్‌హామ్ లైవ్ నివేదించింది.ఈ నేరానికి సంబంధించి బర్మింగ్‌హామ్ క్రౌన్ కోర్ట్ విచారణ జరిపింది.

నిందితుడు తన అల్లుడు పనిచేసే ఫ్యాక్టరీలోనే విధులు నిర్వర్తిస్తున్నాడని.వారిద్దరి మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని పోలీసులు కోర్టుకు సమర్పించిన పత్రాల్లో తెలిపారు.

బాధితుడికి మెడ వెనుక భాగంలో దెబ్బ తగిలిందని ప్రాసిక్యూటర్ అలెక్స్ వారెన్ పేర్కొన్నారు.నిందితుడు తనను తొలుత చెంపదెబ్బ కొట్టాడని బాధితుడు భావించాడు.

అయితే రక్తం కారడంతో తర్వాత కత్తితో దాడి జరిగినట్లుగా గ్రహించాడు.

అనంతరం బాధితుడు తనను తాను రక్షించుకోవడానికి తన ఎడమచేతిని పైకి లేపగా.

కత్తి అతని చేతికి తగలడంతో రక్తస్రావం అయ్యింది.అంతేకాకుండా ఈ దాడిలో బాధితుడి మధ్య వేలు తెగిపడగా.

అతనికి రెండు శస్త్రచికిత్సలు అవసరమని కోర్టు పేర్కొంది.తన మామ తనను చంపేస్తాడని బాధితుడు భావించాడని వారెన్ కోర్టుకు తెలిపాడు.

ప్రాణభయంతో వెంటనే పొరుగువారి ఇంటికి పారిపోయాడని ప్రాసిక్యూటర్ పేర్కొన్నాడు.కోర్టు విచారణ సందర్భంగా జడ్జి సారా బకింగ్‌హామ్ మాట్లాడుతూ.

నిందితుడు ఇటీవల భారత్‌కు చేసిన సుదీర్ఘ పర్యటనే దాడికి కారణమన్నారు.అయితే అతను అయిష్టంగానే యూకేకి తిరిగివచ్చాడని.

ఈ క్రమంలోనే కోపానికి గురై విసుగు చెందాడు.ఎవరో ఒకరిపై అసహనం ప్రదర్శించాలని అనుకున్న నిందితుడు అల్లుడిని లక్ష్యంగా చేసుకున్నారని న్యాయమూర్తి దుయ్యబట్టారు.

Telugu Son, Bhajan Singh, Birmingham, England, Indian Origin, Jailed, Judgesara,

ఇదిలావుండగా.మహిళ మరణానికి కారణమైన నేరంపై భారత సంతతికి చెందిన ఫార్మాసిస్ట్‌కు గతేడాది చివరిలో యూకే కోర్ట్ 18 నెలల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.లండన్‌లో స్థిరపడిన దుష్యంత్ పటేల్ (67)కు ఫార్మా రంగంలో 40 ఏళ్లకు పైగా అనుభవం వుంది.ఈ క్రమంలో ఆయన 2020లో అలీషా సిద్ధిఖీ అనే మహిళకు క్లాస్ సి డ్రగ్స్ సరఫరా చేశాడు.

అయితే ఆగస్ట్ 2020లో ఇంగ్లాండ్‌లోని నార్విచ్‌లో అలీషా శవమై కనిపించింది.దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు.ఆమె మరణించిన దాదాపు నాలుగు నెలల తర్వాత పటేల్‌ను అనుమానితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.అతను మాదకద్రవ్యాల నేరానికి పాల్పడినట్లు నార్విచ్ ఈవినెంగ్ న్యూస్ తన కథనంలో తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube