73 ఏళ్ల వయసు .. భూమిని రెండుసార్లు చుట్టేశాడు , గిన్నిస్ బుక్‌లో చోటు .. భారత సంతతి పెద్దాయన ఘనత

పంజాబ్‌లో జన్మించిన 73 ఏళ్ల భారత సంతతి ఐరిష్( Irish ) వ్యక్తి అరుదైన ఘనత సాధించాడు.భూమిని రెండు సార్లు చుట్టొచ్చిన వ్యక్తిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు.

 Indian Origin Irish Man Eyes Guinness Record For Double ‘earth Walk’ , Vinod-TeluguStop.com

డబుల్ ఎర్త్ వాక్‌ అంటే .దాదాపు 80 వేల కిలోమీటర్ల రెట్టింపు చుట్టుకొలతకు సమానం .సెప్టెంబర్‌ 2020లో తొలి నడక పూర్తి చేయడానికి 1,114 రోజులు.రెండవ ఎర్త్ వాక్‌కు 382 రోజులు పట్టింది.

ఈ ఘనత సాధించిన వ్యక్తి వినోద్ బజాజ్( Vinod Bajaj ) .దాదాపు 50 ఏళ్లుగా ఆయన ఐర్లాండ్‌లోని లిమెరిక్‌ నగరంలో నివసిస్తున్నారు.

తన భార్య ప్రతిరోజూ తన సుదీర్ఘ నడక గురించి ఆందోళన వ్యక్తం చేస్తోందన్నారు బజాజ్.తన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న భయంతోనే ఆమె కంగారు పడుతోందని చెప్పారు.

రెండవసారి ఎర్త్ వాక్( Earth Walk ) చేయొద్దని తన భార్య హెచ్చరించిందని , అయినప్పటికీ దానిని పూర్తి చేశానని వినోద్ తెలిపారు.తాను నడవటం కొనసాగిస్తూనే వుంటానని, కాకపోతే దూరం తగ్గించుకుంటానని .ఎందుకంటే నడక నా రోజువారీ దినచర్యగా మారిందని వినోద్ బజాజ్ చెప్పారు.

Telugu Guinness, Indianorigin, Ireland, Irish, Limerick, Vinod Bajaj-Telugu NRI

బజాజ్( Bajaj ) తన ప్రయాణాన్ని ఆగస్ట్ 2016లో కొంత బరువు తగ్గించుకుని శరీరాన్ని ఫిట్‌గా వుంచుకోవాలనే లక్ష్యంతో ప్రారంభించాడు.ఈ క్రమంలో కిలోగ్రాముల బరువు తగ్గడంతో .నడకపై ఆయన ఉత్సాహం మరింతగా పెరిగి , వాతావరణ పరిమితులను అధిగమించడంపై దృష్టి పెట్టారు.తాను వారానికి ఏడు రోజులు వాకింగ్ చేసి మొదటి మూడు నెలల్లో రోజుకు 700 కేలరీల చొప్పున 8 కిలోల బరువు తగ్గానని వినోద్ బజాజ్ చెప్పారు.తర్వాతి ఆరు నెలల్లో తాను 12 కిలోల బరువు తగ్గానని , ఇది కేవలం నడక వల్లే జరిగిందని ఆయన పేర్కొన్నారు.

Telugu Guinness, Indianorigin, Ireland, Irish, Limerick, Vinod Bajaj-Telugu NRI

గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌కు సంబంధించి అతని దరఖాస్తు ప్రస్తుతం ప్రాసెస్‌లో వుంది.ఎందుకంటే 2,637 రోజులలో 104.8 మిలియన్ మెట్ల భూమి చుట్టుకొలతకు సమానమైన దూరం నడిచాడా లేడా అన్నది వారు అంచనా వేస్తారు.ప్రస్తుతం ఆయన 1,00,000 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటి వరకు ఆయన 21 జతల బూట్లను ఉపయోగించాడు.అన్ని వయసుల వారిని నడక వైపు ప్రేరేపించాలన్నదే తన లక్ష్యమని వినోద్ బజాజ్ స్పష్టంత చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube