మహిళా కార్మికురాలిని చిత్రవధ చేసిన ఎన్నారై.. ఊహించని శిక్షతో లబోదిబో!!

అమెరికాలో( America ) నివసిస్తున్న శ్రీష్ తివారీ( Shreesh Tiwari ) అనే 70 ఏళ్ల భారతీయ వ్యక్తి పలు నేరాలకు పాల్పడినట్లు తాజాగా తేలింది.అతను జార్జియాలోని కార్టర్స్‌విల్లే( Cartersville ) అనే ప్రదేశంలో ఒక మోటెల్‌ను నిర్వహిస్తున్నాడు.

 Indian National Convicted For Coercing Female Worker To Force Labour Details, Sh-TeluguStop.com

ఈ మోటల్‌లో ఓ మహిళను క్లీనర్‌గా నియమించుకున్నాడు.ఆమె మోటెల్‌కు రాకముందు హోమ్ లెస్ మహిళగా నివసించేది.

డ్రగ్స్ వ్యసనంతో తీవ్ర ఇబ్బందులను కూడా ఫేస్ చేసింది.చివరికి ఆమె తన బిడ్డ సంరక్షణను కోల్పోయింది.

అయితే ఈ విషయాలను తెలుసుకున్న తివారీ శాలరీ ఇచ్చి, అపార్ట్‌మెంట్ ఇప్పించి, తన బిడ్డను తిరిగి కాపాడుకోవడానికి లాయర్‌ను అందజేస్తానని ఆమెకు హామీ ఇచ్చాడు.అయితే, ఆయన తన హామీలను నిలబెట్టుకోలేదు.

బదులుగా, అతను అతిథులు, ఉద్యోగులతో సహా మోటెల్‌లోని ఇతర వ్యక్తులతో ఆమెను మాట్లాడకుండా బెదిరించాడు.అంతేకాదు, ఆ మహిళ పట్ల లైంగికంగా అసభ్యంగా ప్రవర్తించాడు.

కాదంటే తాను ఇచ్చిన గది నుంచి ఆమెను గెంటేస్తానని బెదిరించాడు.ఆమె డ్రగ్స్ వాడితే పోలీసులకు లేదా శిశు సంక్షేమ సంస్థలకు ఫిర్యాదు చేస్తానని భయపెట్టాడు.

Telugu Cartersville, Female, Forced Labor, Georgia, Indian National, Sexual Acts

కాలక్రమేణా, తివారీ ఆ మహిళను ఆమె గది నుంచి పదేపదే బయటకు గెంటేసేవాడు.కొన్నిసార్లు హెచ్చరిక లేకుండా రాత్రిపూట ఆమెను బయటకు లాక్కెళ్లేవాడు.అతను చివరికి మోటెల్‌లో ఉండటానికి తనతో సెక్స్ చేయాలని బలవంతం చేశాడు.ఆమె నిరాకరించినట్లయితే, అతను ఆమెను బయటికి పంపించి హోమ్ లోన్స్ స్థితికి మళ్లీ తీసుకొస్తానని బెదిరించాడు.

అతడి భరించలేక బాధితురాలు చివరికి పోలీసులు ఆశ్రయించింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని విచారించి అతడిని దోషిగా తేల్చారు.

Telugu Cartersville, Female, Forced Labor, Georgia, Indian National, Sexual Acts

సెప్టెంబరు 6న తివారీకి శిక్ష విధించనున్నారు.అతనికి 20 సంవత్సరాల జైలు శిక్ష, 2,50,000 లక్షల జరిమానా విధించవచ్చు.అతను తన అభ్యర్ధన ఒప్పందంలో భాగంగా బాధితులకు పరిహారంగా సుమారు 40,000 డాలర్లు చెల్లించడానికి అంగీకరించాడు.మార్గదర్శకాలు, ఇతర చట్టపరమైన అంశాల ఆధారంగా తుది శిక్షను న్యాయమూర్తి నిర్ణయిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube