స్పెల్లింగ్ బీ పోటీలలో సత్తా చాటిన భారత సంతతి పిల్లలు.... విన్నర్, రన్నరప్ రెండూ మనవే..!

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వెళ్లిన భారతీయులు పలు రంగాల్లో సత్తా చాటుతోన్న సంగతి తెలిసిందే.అయితే తాము పెద్దలకు ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తున్నారు భారత సంతతి చిన్నారులు.

 Indian-american Girl Harini Logan Wins 2022 Scripps National Spelling Bee After-TeluguStop.com

చదువుతో పాటు ఆట పాటల్లోనూ మెరుగ్గా రాణిస్తూ భారతదేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు.తాజాగా అమెరికాలో జరిగిన ప్రతిష్టాత్మక స్పెల్లింగ్ బీ పోటీలలో భారతీయ చిన్నారులు రాణించారు.విన్నర్‌, రన్నరప్ రెండూ ట్రోఫీలను సొంతం చేసుకున్నారు.

2022 స్క్రిప్స్ స్పెల్లింగ్‌ బీ పోటీల్లో టెక్సాస్‌లోని ఆంటోనియోకు చెందిన హరిణి లోగన్ (14) విజేతగా అవతరించింది.అలాగే భారత సంతతికే చెందిన విక్రమ్ రాజు(12) రెండో స్థానంలో నిలిచాడు.విజేతను నిర్ధారించే చివరి రౌండ్‌లోని 90 సెకన్లలో హరిణి ఏకంగా 21 పదాలకు కరెక్ట్ స్పెల్లింగ్స్ చెప్పి విజేతగా నిలిచింది.

scyllarian, pyrrolidone, Otukian, Senijextee వంటి కఠినమైన పదాలకి సైతం కరెక్ట్ స్పెల్లింగ్స్ చెప్పి హరిణి అందరినీ ఆశ్చర్యపరిచింది.ఈ పోటీల్లో పాల్గొన్న 230 మందిని వెనక్కినెట్టి హరిణి ఈ ఘనత దక్కించుకుంది.

ఇక రెండో స్థానంలో నిలిచిన విక్రమ్ రాజు 15 పదాలకు మాత్రమే సరైన స్పెల్లింగ్స్ చెప్పగలిగాడు.హరిణికి జ్ఞాపికతో పాటు రూ.38 లక్షల రివార్డ్ అందజేశారు.ఇక రన్నరప్‌గా నిలిచిన విక్రమ్ రాజుకు రూ.22 లక్షల ప్రైజ్‌మనీ దక్కింది.

Telugu Africanamerican, Chaitra Tummala, Harini Logan, Indian American, Indianam

ఇకపోతే.స్పెల్లింగ్ బీ 2021లో భారత సంతతికి చెందిన చైత్ర తుమ్మల రన్నరప్‌తో సరిపెట్టుకున్న సంగతి తెలిసిందే.ఆ ఏడాదికి గాను.

లూసియానా రాష్ట్రంలోని హర్వేకు చెందిన అఫ్రికన్ అమెరికన్ జైలా అవంత్ గార్డె(14) విజేతగా నిలిచింది.జైలా, చైత్ర ఇద్దరూ 2015 ‘స్పెల్లింగ్-బీ’ రన్నరప్ వద్ద శిక్షణ పొందారు.

స్పెల్లింగ్ బీ 2021 ఫైనల్‌లో “murraya,” అనే పదానికి స్పెల్లింగ్ చెప్పాల్సిందిగా జైలాను న్యాయనిర్ణేతలు అడిగారు.ఆ వెంటనే ఆమె ఏ మాత్రం తడబడకుండా సరైన సమాధానాన్ని చెప్పింది.

“murraya,” అంటే ఉష్ణ మండల ఆసియా, ఆస్ట్రేలియన్ జాతికి చెందిన చెట్టు పేరు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube