2023-24కు గాను వైట్‌హౌస్ ఫెలోస్ లిస్ట్‌కు( White House Fellows List ) ఎంపికైన 15 మందిలో భారత సంతతికి చెందిన క్యాన్సర్ వైద్య నిపుణురాలు కమల్ మెంఘ్‌రజనీ( Kamal Menghrajani ) స్థానం దక్కించుకున్నారు.కమల్ .
సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ కార్యాలయంలో సేవలు అందించనున్నారు.లుకేమియాతో బాధపడుతున్న రోగులకు చికిత్స అందించడంలో ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు.
వైట్‌హౌస్ ఫెలోస్ హోదాలో ఆమె సీనియర్ అధికారులు, కేబినెట్ సెక్రటరీలు, ఇతర ఉన్నత స్థాయి అమెరికన్ పరిపాలనా యంత్రాంగంతో కలిసి ఏడాది పాటు పనిచేయనున్నారు.వైట్‌హౌస్ ఫెలోస్ 2023-24కి ఎంపికైన 15 మందిలో కమల్ ఏకైక భారతీయ అమెరికన్ అని అమెరికా అధ్యక్ష కార్యాలయం సెప్టెంబర్ 20న ఒక ప్రకటనలో తెలిపింది.
దీనిపై కమల్ ఎక్స్ (గతంలో ట్విట్టర్) ద్వారా స్పందించారు.అమెరికా అధ్యక్షుడు జో బైడెన్( US President Joe Biden ) తన నియామకాన్ని ప్రకటించారని తెలిపారు.వైట్‌హౌస్ ఫెలోగా ఎంపికైన తొలి ఆంకాలజిస్ట్‌గా.ఈ కొత్త పాత్రలో రోగులకు సేవలందించడానికి ఎదురుచూస్తున్నట్లు కమల్ మెంఘ్‌రజనీ పేర్కొన్నారు.బైడెన్ కార్యనిర్వాహక కార్యాలయంలోని ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో క్యాన్సర్ మూన్‌షాట్ అండ్ హెల్త్ ఔట్‌కమ్‌ల టీమ్‌లతో కమల్ పనిచేయనున్నారు.మెమొరియల్ స్లోన్ కెట్టరింగ్ క్యాన్సర్ సెంటర్‌లో( Memorial Sloan Kettering Cancer Center ) ఫ్యాకల్టీగా వున్నప్పుడు ఆమె క్యాన్సర్ పరిశోధనలు చేశారు.
ముందస్తుగా వ్యాధి నిర్ధారణ, నివారణపై కమల్ దృష్టి సారించారు.నికరాగ్వా, బొలీవియా, ఉగాండా సహ పలు దేశాల్లో విపత్కర పరిస్థితుల్లో కమల్ మెంఘ్‌రజనీ సేవలందించారు.
వ్యాపారవేత్తగా, క్యాన్సర్ చికిత్సలో అపరిష్కృతమైన అవసరాలను తీర్చడానికి , త్వరిత క్యాన్సర్ నిర్ధారణ కోసం కృత్రిమ మేథను వినియోగించడానికి కమల్.పలు స్టార్టప్‌లను స్థాపించారు.అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమాల్లో విద్యార్ధి నాయకులను సామాజిక వ్యవస్థాపకులుగా నిమగ్నం చేసే లాభాపేక్ష లేని నోరిష్ ఇంటర్నేషనల్ అభివృద్ధిలోనూ కమల్ మెంఘ్‌రజనీ కీలకపాత్ర పోషించారు.1964లో వైట్‌హౌస్ ఫెలోస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.