సోష‌ల్ మీడియాలో అలాంటి పుకార్లు క్రియేట్ చేయ‌డంలో ఇండియానే టాప్‌..

ఈ మ‌ద్య సోషల్ మీడియాలో ఏది న‌మ్మాలో ఏది న‌మ్మ‌కూడదో అర్థం కావ‌ట్లేదు.ఇక్క‌డ నిజం ఎంత‌లా ప్ర‌చారం పొందుతుందో అబ‌ద్ధం కూడా అదే స్థాయిలో ప్ర‌చారం జ‌రుగుతుంది.

 India Is The Top In Creating Such Rumors On Social Media, Social Media, India, C-TeluguStop.com

సాధార‌ణంగానే సోషల్ మీడియా చాలామంది జీవితాల‌ను ప్రభావితం చేస్తుంది.మ‌న‌కు బ‌య‌ట క‌నిపించే వార్త‌ల కంటే కూడా సోషల్ మీడియాలో వ‌చ్చే వార్త‌లే ఎక్కువ‌గా ట్రెండ్ అవుతుంటాయి.

నిత్యం ఏదో ఒక తప్పుడు వార్త హ‌ల్ చ‌ల్‌గా మారిపోతున్నాయి.కాగా ఇప్పుడు ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న కరోనా వైరస్ విష‌యంలో కూడా ఇలాంటి పుకార్లే ఇప్ప‌టికీ వినిపిస్తున్నాయి.

క‌రోనా వ‌చ్చిన మొద‌ట్లో సోష‌ల్ మీడియాలో ఎక్క‌డ చూసినా దీని గురించే క‌నిపించింది.ఇక క‌రోనా వైరస్ ఎలా వ్యాప్తిచెందుతుందో దాని గురించి తెలుసుకునేందుకు అప్ప‌ట్లో చాలామంది దీన్నే న‌మ్మేవారు.

అయితే వారి న‌మ్మ‌కాన్ని ఆస‌రాగా చేసుకుని కొంద‌రు కావాల‌ని త‌ప్పుడు పోస్టులు కూడా పెట్టారు.ఎంతో మంది ఎన్నో ర‌కాలుగా పుకార్లు సృష్టించిన జ‌నాల‌ను భయాందోళన పెట్టార‌ని చెప్పాలి.

దీని త‌ర్వాత వ్యాక్సిన్ రావ‌డంతో దానిపై కూడా సోషల్ మీడియా వేదిక‌గా బోలెడ‌న్ని తప్పుడు వార్తలు రావ‌డం మ‌నం చూశాం.

Telugu Coroan Vaccine, Corona Wave, Corona, India, India Place, Rumors Corona-La

కాగా ఇలాంటి త‌ప్పుడు వార్త‌లు అస‌లు ఒక్క ఇండియాలోనేనా లేక ప్ర‌పంచ దేశాల్లో కూడా ఇలాగే జ‌రుగుతుందా అను అనుమానం రాక‌మాన‌దు.అయితే దీనిపై స‌ర్వే చేయ‌గా ఇలాంటి పుకార్లు చేయ‌డంలో ఇతర దేశాల కంటే కూడా ఇండియా మొద‌టిస్థానంలో ఉన్న‌ట్టు తేలింది.ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ లైబ్రరీ అసోసియేషన్ అనే సంస్థ చేప‌ట్టిన ఈ పుకార్ల స‌ర్వేలో సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.130 దేశాలపై ఇలాంటి క‌రోనా పుకార్ల‌పై స‌ర్వే చేయ‌గా 18.07 శాతంతో భారత్ టాప్ ప్లేస్‌లో నిలిచింది.అయితే ఇండియ‌న్ల‌కు పెద్ద‌గా అవ‌గాహ‌న లేక‌పోవ‌డంతోనే ఇలా జ‌రిగింద‌ని తెలిపంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube