జెఫ్ బెజోస్ అంటే ప్రపంచ కుబేరుడన్న విషయం అందరికీ విదితమే.కాగా ఆయనకు చెందినటువంటి బ్లూ ఆరిజిన్ సంస్థ ఇప్పుడు ఓ విషయంలో పై చేయి సాధించింది.
అదేంటంటే ఆయన కంపెనీ నాసా మూన్ ల్యాండర్ కాంట్రాక్ట్ విషయంలో కొద్ది రోజుల క్రితం యూఎస్ ప్రభుత్వంపై దావా దాఖలు చేయగా ఈ విషయం అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.ఇక నాసా సంస్థపై కూడా పోరాడేందుకు జెఫ్ బెజోస్ కంపెనీ రెడీ అయిపోయిదంఇ.
ఇక ఇందులో భాగంగా బ్లూ ఆరిజిన్ సంస్థ యూఎస్ కోర్టులో తమ వాదనను వినిపించేందుకు దావాలను వేసింది.
దీంతో ఇప్పుడు నాసా సంస్థ కూడా ఏకపక్ష నిర్ణయాలపై కాస్త వెనక్కు తగ్గింది.
ఇంతకు ముందు నాసా సంస్థ తాము చేపట్టే ప్రయోగాలకు సంబంధించిన మిషిన్నల డిజైన్లను ఒకే కంపెనీకి ఇచ్చేది.అయితే దీనిపై బ్లూ ఆరిజిన్ పోరాడటంతో త్వరలోనే నాసా చంద్రుడిపై ప్రయోగించనున్న మూన్ ల్యాండింగ్ మిషన్ కు సంబంధించినటువంటి డిజైన్ కాంట్రాక్ట్ లను వివిధ సంస్థలకు అప్పగించేందుకు సిద్ధం అయింది.
ఇప్పటికే మనుషులు లేకుండానే మూన్ ల్యాండర్ మిషన్ పంపిచేందుకు నాసా సంస్థ 2024 సంవత్సంరంలో ఆర్టిమిస్ ప్రోగ్రాం చేసేందుకు రెడీ అవుతోంది.
మనుషులు లేనటువంటి మూన్ ల్యాండర్‌ను చంద్రుడిపై పంపించేందుకు నాసా రెడీ అవుతున్న తరుణంలో ఒకే కంపెనీకి ఇందుకుం సబంధించిన కాంట్రాక్టులు ఇవ్వడంతో దీనిపై బ్లూ ఆర్టిజెన్ అభ్యంతరం వ్యక్తంచేసింది.దీంతో ఈ కంపెనీ దెబ్బకు మూన్ ల్యాండింగ్ డిజైన్‌కు కాంట్రాక్టులను ఐదు కంపెనీలకు దక్కింది.ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ ఐదు కంపెనీల్లో జెఫ్ బెజోస్‌కు చెందినటువంటి బ్లూ ఆరిజిన్ తో పాటు ఎలన్ మస్క్‌కు కు చెందినటువంటి స్పేస్ ఎక్స్ కంపెనీలు ఉన్నాయి.ఏదేమైనా కూడా కుబేరుల పంతం నెగ్గిందని చెప్పొచ్చు.