ఓ లారీ డ్రైవర్ చేసిన పని ఇప్పుడు నెట్టింటా తెగ వైరల్ గా మారింది.ప్రయాణాల సమయంలో మన పక్కన కాస్త స్పీడ్ గా వెళితేనే బండ భూతులు తిట్టి వారిని ఆడి పోసుకుంటాం.
అదీ హైవేలు మామూలు రోడ్లలోనే.ఇంట్లో చెప్పి వచ్చావా లేక చావడానికి వచ్చావ అని వారిపై మండి పడతాం.
కాని ఇది అందరి డ్రైవర్లకు వర్తించదని కొన్ని కొన్ని సందర్భాల్లో తెలుస్తుంది.నదీ తీర ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్నదారుల్లో మలుపుల్లో లారీ డ్రైవర్లు చేస్తున్న సాహసాలు చూస్తే ఆశ్చర్యపోవడం మన వంతు అవుతుంది.
వారి ట్యాలెంట్ స్కిల్ ఉపయోగించి ప్రమాదకర దారులను ఈజీగా దాటుతుంటే నోరెళ్లబెట్టి చూస్తుంటాం.ఎత్తైన బ్రిడ్జీల్లో వారి స్టంట్ లకు కంగుతింటాం.
ఇలాంటి సహసాలు చేసే డ్రైవర్ల ట్యాలెంట్ కు అప్పుడు ఓ సెల్యూట్ చేయాలని పిస్తుంటది.కాని ఇది అందరి డ్రైవర్లకు వర్తించదని కొన్ని సందర్భాల్లో చూస్తాం.
ట్యాలెంట్ తో చేసే వారిని చూసి ప్రయ్నం చేస్తే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లే అవుతుంది.
అలాంటి సాహసాలు చేసి ప్రాణాలమీదకు తెచ్చుకున్నట్లే అవుతుంది.
ఫుల్ కాన్ఫిడెన్స్ తో సహసం చేసిన ఓ లారీ డ్రైవర్ వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది.అసలు విషయంలోకి వెళితే.
ఓ నదిపై రైలింగ్ లేని వంతెన ఉంది.ఆ నది పై నడవాలంటేనే జనం గుండెల్లో గుబేల్ మంటది.
ఏదైన వాహనంలాంటిది దాటితే ఆ వంతెన ఊగుతుంటది.అలాంటి వంతెన పై చిన్న పొరపాటు జరిగినా నేరుగా నదిలో పడిపోవాల్సిందే.
అంతటి ప్రామాదకర వంతెనపై ఓ లారీ డ్రైవర్ ఏకంగా తన లారీని మూమూలు రోడ్డులో నడిపినట్లు ఫుల్ కాన్ఫిడెన్స్ తో నడిపి ఈజీగా ఆ వంతెనను దాంటించేశాడు.ఇది చూసిన నెటిజన్లు లారీ డ్రైవర్ స్కిల్ ను తెగ పొగిడేస్తున్నారు.
రకరకాల రియాక్షన్ లతో తమ కామెంట్ లను తెలియజేస్తున్నారు.కేవలం 42 సెకండ్ల ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.