తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తల్లో,నాయకుల్లో ఏదో తెలియని కొత్త జోష్ ఏర్పడింది.దానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి ( Revanth reddy ) అని ఎప్పటినుండో రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎందుకంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పీసీసీ చీఫ్ అయ్యాకే కార్యకర్తల్లో, నాయకుల్లో కొత్త ఉత్సాహం నింపారు.ఇక రాహుల్ గాంధీ( Rahul gandhi ) , ప్రియాంక గాంధీ కూడా బస్సు యాత్ర మొదలుపెట్టి సక్సెస్ఫుల్ అయ్యారు.
అయితే కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ వచ్చినప్పటికీ నాయకుల్లో మాత్రం కాస్త అసంతృప్తి ఉంది.ఇక టికెట్ విషయంలో కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి.
అలాగే ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సీఎం ఎవరు అనే దానిపై కూడా చర్చ జరుగుతుంది.

ఇదంతా పక్కన పెడితే తెలంగాణ ( Telangana ) లో కాంగ్రెస్ గెలిస్తే మళ్ళీ తెలంగాణ ఆంధ్ర వాళ్ళ చేతుల్లోకే వెళ్తుంది అంటూ ప్రజలు భావిస్తున్నారట.దానికి ప్రధాన కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.2018 ఎన్నికల్లో కాంగ్రెస్ టిడిపి తో కలిపి పొత్తు పెట్టుకుని ఉన్న కేడర్ ని కూడా పోగొట్టుకుంది.అయితే టిడిపి పార్టీ కాంగ్రెస్ కి ప్లస్ అవుతుంది అనుకున్నప్పటికీ పెద్ద మైనస్ అయింది.ఆ ఎన్నికల్లో బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే మళ్ళీ ఆంధ్ర నాయకులు చేతుల్లోకి తెలంగాణ ప్రజలు వెళ్తారని,మళ్లీ మన భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారుతుంది అంటూ ప్రచారం చేయడంతో అందరూ మళ్లీ కేసీఆర్ నే గెలిపించారు.

అయితే ఈసారి కూడా కాంగ్రెస్ గెలిస్తే మళ్లీ ఆంధ్ర పాలనే అంటూ ప్రజలు భావిస్తున్నారట.ఎందుకంటే చాలామంది ప్రజలు రేవంత్ రెడ్డిలో చంద్రబాబు నాయుడు ( Chandrababu naidu ) ని చూస్తున్నారట.ఇక కమ్మ సామాజిక వర్గానికి చెందిన చాలా మంది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ ఆంధ్ర పాలనే అని ప్రచారం చేస్తున్నారట.ఇక ఓ ఎల్లో మీడియా అధినేత అయితే ఈ విషయాన్ని బహిరంగంగానే బయట పెట్టడంతో అందరిలో భయం మొదలైంది.
అంతేకాదు కాంగ్రెస్ కి సాంప్రదాయ ఓటు బ్యాంకు అయినా చాలామంది రెడ్లు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా బిఆర్ఎస్( BRS PARTY ) కి ఓటు వేసేందుకు సుముఖంగా ఉన్నారట.ఎందుకంటే ఇప్పటికే బిఆర్ఎస్ (BRS) పార్టీలో 40 కి పైగా సీట్లు రెడ్లకు ఇవ్వడంతో వారి ఓటు బ్యాంకు మొత్తం బిఆర్ఎస్ పార్టీ వైపు తిరిగిందట.
అంతేకాదు ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం కుర్చీలో రేవంత్ రెడ్డి కూర్చున్నప్పటికీ పెత్తనం మొత్తం రేవంత్ రెడ్డిదే ఉంటుంది అని,రేవంత్ రెడ్డి ని వెనకండి చంద్రబాబు నాయుడు నడిపిస్తారని కొంతమంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు భావిస్తున్నారట.అయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో కొత్త జోష్ తెచ్చినప్పటికీ కూడా ఆయనలో ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడినే చూస్తున్నారట.
ఈ కారణంతోనే కాంగ్రెస్ గెలిస్తే మళ్ళీ తెలంగాణ ఆంధ్ర పాలకుల చేతుల్లోకి వెళుతుంది అని ప్రజలు భావిస్తున్నారట.