బాలయ్య బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన భగవత్ కేసరి సినిమా నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది.ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది.
అయితే ఈ సినిమాలో బాలయ్య బాబుని కొత్త అవతారంలో చూపించిన అనిల్ రావిపూడి ఈ సినిమాని సక్సెస్ చేశారనే చెప్పాలి.ఈ సినిమాలో ఉన్న చాలా ఎలిమెంట్స్ చాలా డిఫరెంట్ గా చేసి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకునే దిశ గా దూసుకుపోతుంది.
లాంగ్ రన్ లో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యే అవకాశం ఉంది.అయితే భగవంత్ కేసరి ఈ సినిమా గురించి మనం చూసుకుంటే ఈ సినిమాని ముందు అనిల్ రావిపూడి ఇంతకు ముందు కమలహాసన్ తో చేద్దాం అనుకున్నాడంట కానీ కొన్ని కారణాల వల్ల ఈ కాంబినేషన్ సెట్ అవ్వలేదు.
దాంతో ఆయన F3 సినిమా చేసి మళ్లీ బాలయ్య బాబుతో భగవంత్ కేసరి అనే సినిమా చేసి మన ముందుకు తీసుకొచ్చారు.

ఇక ఇలాంటి క్రమంలో ఇండస్ట్రీలోనే కాదు ఇప్పుడు అభిమానుల్లో కూడా ఈ సినిమా మీద మంచి అంచనాలు నెలకొనడంతో ఈ సినిమా సక్సెస్ సాధించిందనే చెప్పాలి.ఇక దాంతో డైరెక్టర్ గా అనిల్ రావిపూడి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో రాజమౌళి తర్వాత వరుసగా 7 హిట్టు కొట్టిన డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు.ఇక ఇలాంటి క్రమంలో అనిల్ రావిపూడి సూపర్ డూపర్ హిట్స్ కొట్టిన డైరెక్టర్ గా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు….
ఈయన చేసిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యమైన ఎలిమెంట్ తో ఉండటమే కాకుండా మంచి వినోదాన్ని కూడా పంచుతాయి……అందుకే అనిల్ కి ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉంది…ఇక మీదట కూడా ఈయన అన్ని జానర్స్ లో సినిమా చేయాలని చూస్తున్నట్టు గా రీసెంట్ గా ఆయన తెలియజేయడం జరిగింది
.








