వంద రూపాయల కోసం అలాంటి కష్టాలు అనుభవించానంటున్న హైపర్ ఆది..

జబర్దస్త్.గత ఏడు ఏళ్లగా టాప్ కామెడీ షో గా కొనసాగుతుంది.

 Jabardasth Hyper Aadi Shares His Life Story, Hyper Aadi, Real Life News, Jabarda-TeluguStop.com

ఈ షో టీఆర్పీ చూసి ఎన్ని ఛానెల్స్ అలాంటి కామెడీ షోస్ చేసిన ఒక్కటి కూడా సక్సెస్ అవ్వలేదు.ఏ ఛానెల్ ప్రారంభించిన కేవలం నెలలలో షో కి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు.

అందుకు కారణం ఈ షోలో పేలే పంచ్ లు.ఒకోకరు సూపర్ స్క్రిప్ట్స్ వచ్చి అందరిని ఆకట్టుకుంటారు.కామెడీతో జబర్దస్త్ ని నిజమైన జబర్దస్త్ చేశారు.ఇక ఈ జబర్దస్త్ లో స్కిట్ చేసిన చాలామందికి మంచి జీవితం వచ్చింది.

అలా మంచి జీవితాన్ని ఆస్వాదిస్తూ.మంచి పాపులారిటీ తెచ్చుకున్న కమెడియన్స్ లో హైపర్ ఆది ఒకరు.

అది జీవితం మొత్తం టర్నింగ్ పాయింట్ జబర్దస్త్.ఈ షోకు హైపర్ అది రావడానికి ముఖ్య కారణం అదిరే అభి.

టీమ్ లీడర్ గా కొనసాగుతూ తనకంటూ ఓ మంచి పేరు తెచ్చుకున్న అదిరే అభి హైపర్ ఆది ట్యాలెంట్ చూసి తన స్కిట్ లో ఒక చోటా అవకాశం ఇచ్చాడు.ఇక అదిరే అభి స్కిట్స్ లో హైపర్ ఆది చేసిన పర్ఫార్మెన్స్ చుసిన జబర్దస్త్ షో నిర్వాహకులు హైపర్ ఆదినే టీమ్ లీడర్ గా చేశారు.

అలా హైపర్ ఆది ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నాడు.

అయితే ఇప్పుడు జబర్దస్త్ 400వ ఎపిసోడ్ పూర్తి చేసుకుంటుంది.

దీంతో జబర్దస్త్ కు ముందు వారి జీవితాల్లో ఎలాంటి కష్టాలు పడ్డారు అనేది వారు ఇందులో చెప్పుకున్నారు.యాంకర్ అనసూయ నుంచి కమెడియన్స్ వరకు అందరూ వారి కష్టాలను ఈ ఎపిసోడ్ లో చెప్పుకున్నారు.

ఇక అలానే హైపర్ అది కూడా తన కష్టాలను చెప్పుకొచ్చాడు.ఈ షో కు రాకముందు ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులు పడినట్టు.వంద రూపాయిల కోసం పక్కింటికి వెళ్లి అడిగే పరిస్థితి అని.కానీ ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నట్టు దానికి కారణం జబర్దస్త్ అని.జబర్దస్త్ లో ఉండడానికి కారణం అభి అన్న.అభి అన్న రుణం ఎప్పటికి తీర్చుకోలేను అని చెప్పుకొచ్చాడు హైపర్ ఆది.అయితే ఇది కేవలం జబర్దస్త్ ప్రోమోనే.వచ్చే వారం ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube