ఈ మధ్య వివాహబంధం ఆటలాగా మారిపోయింది.భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గిపోతుంది.
చిన్న చిన్న విషయాలకు కూడా గొడవలు పడుతూ ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తున్నారు.క్షణికావేశంలో నిండు జీవితాన్ని బలి తీసుకుంటున్నారు.
తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది.భార్యతో గొడవ పడి ఆ ఆవేశంలో భార్యను గొడ్డలితో దారుణంగా హతమార్చాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.
ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది.
వెల్గటూరు మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన శంకరయ్య, సుజాత ఇద్దరు భార్యాభర్తలు.వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
అయితే వీరిద్దరూ కొన్ని రోజులుగా తరచూ గొడవ పడుతుండేవారు.పెద్దలు ఎంత నచ్చజెప్పినా వారు అలాగే గొడవలు పడుతూనే ఉండేవారు.
ఈ నేపథ్యంలోనే శనివారం రాత్రి కూడా వీరిద్దరూ మళ్ళీ గొడవ పడ్డారు.ఈ గొడవ తర్వాత శంకరయ్య భార్యను ఎలాగైనా చంపి తనకు అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు.
అనుకున్నదే తడవుగా ఉదయం భార్య బాత్ రూమ్ కి వెళ్ళగానే వెనుకగా వెళ్లి గొడ్డలితో భార్యపై దాడి చేసాడు.ఆ దాడిలో భార్య సుజాత అక్కడికక్కడే మృతి చెందింది.
భార్య సుజాత మృతి చెందడంతో శంకరయ్య అక్కడి నుండి పరారయ్యాడు.అప్పటికి ఇంకా పిల్లలు కూడా లేవలేదు.తర్వాత కొద్దీ సేపటికి పిల్లలు లేచి రక్తపు మడుగులో ఉన్న తల్లిని చూసి ఏడ్వడం మొదలు పెట్టారు.వాళ్ళ ఏడుపుని గమనించిన స్థానికులు లోపలి వచ్చి చూడగా సుజాత అప్పటికే చనిపోయి ఉంది.
దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు.
స్థానికుల ఫిర్యాదుతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆమె మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.నిందుతుడు పరారీలో ఉన్నాడు.
అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.