మన దేశంలో స్త్రీలపై హింస రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా న్యాయవ్యవస్థ బాధితులకు అండగా నిలబడుతున్నా హింసకు గురైన వారి సంఖ్య మాత్రం ఏ మాత్రం తగ్గటం లేదు.
చాలా మందికి తమకు చట్టం సహాయం చేస్తుదన్న విషయం కూడా తెలియదు.అందుకేనేమో భరిస్తూ ఉండిపోతున్నారు.
మహిళలు మరి కొంత మంది బయటకు వస్తే గౌరవం కోసం, మరికోందరు తమ పిల్లలు అనాధలు అయిపోతారని వారి పరిస్థితి ఏంటి.! ఇలా రకరకాల కారణాలతో వారు గృహ హింసను భరిస్తుంటారు.
అసలు విషయానికొస్తే.అదనపు కట్నం భార్యకు ఒత్తిడి తెచ్చాడు ఓ భర్త.దీనికి భార్య నిరాకరించినందుకు భార్యతో భర్త బలవంతంగా యాసిడ్ తాగించిన ఘటన మధ్యప్రదేశ్ లో గ్వాలియర్ లోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.వీరేంద్ర కుమార్ అనే వ్యక్తికి ఈ ఏడాది న శశితో వివాహం అయ్యింది.వధువు తల్లిదండ్రులు రూ.10 లక్షలు పైగా ఖర్చు పెట్టి ఘనంగా వివాహం జరిపించారు.వీరేంద్ర కారు కొనుక్కోవడానికి భార్యను ఇబ్బంది పెడుతున్నాడు.రూ.3 లక్షలు అదనపు కట్నం తీసుకురావాలని భార్యను రోజు వేధిస్తున్నాడు.

అందుకు నిరాకరించడంతో భార్యాభర్తలిద్దరూ మధ్య ఘర్షణ జరిగింది.దీంతో వీరేంద్ర అతని భార్య కు బలవంతంగా యాసిడ్ తాగించాడు.దీంతో బాధితురాలు ప్రస్తుతం ఢిల్లీలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
ఆమె శరీరావయవాలు భాగాలు దెబ్బతిన్నాయని మెరుగైన వైద్యం కోసం ఢిల్లీకి ఆస్పత్రికి తరలించినట్లు స్థానిక వైద్యులు చెప్పారు.భర్తను పోలీసులు అరెస్టు చేశారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.