ఏపీలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు( Assembly elections ) రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వేటలో పడింది.ఈ మేరకు రేపటి నుంచి ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది.
అసెంబ్లీతో పాటు లోక్ సభ స్థానాలకు పోటీ చేసే ఆశావహుల నుంచి దరఖాస్తులను పార్టీ అధిష్టానం స్వీకరించనుంది.ఈ నేపథ్యంలో రేపు విజయవాడలో తొలి అప్లికేషన్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ ( Manickam Tagore )తీసుకోనున్నారు.ఇప్పటికే కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని పీసీసీ వర్గాలు చెబుతున్నాయని తెలుస్తోంది.మరోవైపు జిల్లాల పర్యటనలో ఉన్న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల( YS Sharmila )ను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని ఆశావాహులు భావిస్తున్నారని సమాచారం.