తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) లాంటి నటుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో చాలా మంచి సినిమాలు చేసి నటుడిగా తన స్థాయిని భారీ స్థాయి లో నిరూపించుకున్నాడు.
ఇక ఈ సందర్భంలోనే ఆ తర్వాత తనకి వరుసగా ఒక పది సంవత్సరాలపాటు ఒక్క హిట్టు కూడా లేకుండా వచ్చాడు.
అయినప్పటికీ తన క్రేజ్ మాత్రం కొంచం కూడా తగ్గకుండా ఇమేజ్ ని పెంచుకుంటూ వచ్చాడు అలా ఇండస్ట్రీలో ఒక్క హిట్టు లేకుండా పది సంవత్సరాలపాటు ఇండస్ట్రీలో సర్వే అవ్వడం అంటే నార్మల్ విషయం కాదు.
ఇక పవన్ కళ్యాణ్ అలాంటి గడ్డు పరిస్థితిలని కూడా ఎదుర్కొని వచ్చాడు.ఇక ఇప్పుడు రాజకీయాల్లో ( Politics ) బిజీగా ఉంటున్నప్పటికీ ఆయన వరుస సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.
అయితే ఇప్పటికే ఆయన హరీష్ శంకర్, సుజీత్ డైరెక్షన్ లో నటిస్తున్నాడు.అయితే హరీష్ శంకర్( Harish Shankar ) సినిమాలో పవన్ కళ్యాణ్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్( Ustad Bhagat Singh ) సినిమాలో ఒక కీలకమైన పాత్రలో తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ నటుడు అయిన విక్రమ్ ( Vikram ) నటిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.అయితే అది విలన్ పాత్రనా, లేదంటే పవన్ కళ్యాణ్ కి హెల్ప్ చేసే పాత్రనా అనేది తెలీదు గానీ
ఒక ఇంపార్టెంట్ పాత్రలో అయితే విక్రమ్ ని తీసుకోబోతున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి.ఇక హరీష్ శంకర్ విక్రమ్ కి తన క్యారెక్టర్ కూడా ఎక్స్ ప్లెయిన్ చేసినట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పుడు హరీష్ శంకర్ రవితేజతో సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు…ఈ సినిమాని మూడు నెలల్లో ఫినిష్ చేసి పవన్ కళ్యాణ్ సినిమా మీదకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది…
.