ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్( Election Commission ) ఆదేశాల మేరకు ప్రభుత్వం భారీగా మున్సిపల్ కమిషనర్లను( Municipal Commissioners ) బదిలీ చేయడం జరిగింది.దాదాపు 92 మంది కమిషనర్లు, అదనపు కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 Huge Transfer Of Municipal Commissioners In Andhra Pradesh State Details, Ec, A-TeluguStop.com

గడచిన మూడేళ్లు ఒకే చోట పని చేసిన వారితోపాటు జూన్ 30వ తేదీ నాటికి మూడేళ్లు పూర్తయ్యే వారిని.సొంత జిల్లాలకు కాకుండా ఇతర జిల్లాలకు బదిలీ చేయడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరుగునున్నాయి.ఈ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ అధికారులు ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించడం జరిగింది.

ఎన్నికలు సజావుగా సాగేలా రాష్ట్రం వ్యాప్తంగా ఉన్నత అధికారులతో సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది.ఈ ఏడాది ప్రారంభంలో కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ మూడు రోజులపాటు పర్యటించడం జరిగింది.చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్( CEC Rajiv Kumar ) నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు పర్యటించారు.ఓటర్ల జాబితాలో అవకతవకలు పార్టీ ఫిర్యాదులపై సమీక్షలు చేయడం జరిగింది.

అనంతరం ఏపీలో తుది ఓటర్ల జాబితా( Voters List ) విడుదల చేయడం జరిగింది.

పరిస్థితి ఇలా ఉండగా ఫిబ్రవరి నెలలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మార్చిలో ఎన్నికలు జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి.2019 మాదిరిగానే 2024 ఎన్నికలు కూడా జరగనున్నట్లు ప్రచారం జరుగుతుంది.దీంతో తెలంగాణలో జరిగిన మాదిరిగానే ఏపీలో కూడా ఎన్నికలు సజావుగా సాగేలా కేంద్ర ఎన్నికల సంఘం పకడ్బందీగా వ్యవహరిస్తుంది.

నిర్లక్ష్యంగా వ్యవహరించే  అధికారులను సస్పెండ్ చేస్తూ ఉంది.ఈ క్రమంలో తాజాగా మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేసే విధంగా ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయటం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube