సౌత్ హీరోయిన్ అమలాపాల్ ( Amala Paul ) ఈ మధ్యకాలంలోనే రెండో పెళ్లి చేసుకుంది.ఇక ఈమె నవంబర్ 5 న తాను ప్రేమించిన అబ్బాయిని గ్రాండ్ గా హోటల్లో రెండో పెళ్లి చేసుకుంది.
అయితే వీళ్ళిద్దరూ ఎప్పటి నుండో ప్రేమించుకున్నప్పటికీ ఈ విషయం మాత్రం అమలాపాల్ పుట్టినరోజు న బయటపడింది.వీరిద్దరూ ప్రపోజ్ చేసుకుని కనీసం 10 రోజులు కూడా దాటకముందే పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అయ్యారు.
ఇక సడన్ గా అమలాపాల్ అలా రెండో పెళ్లి చేసుకోవడంతో చాలా మంది షాక్ అయ్యారు.అంతేకాదు అమలాపాల్ రాత్రికి రాత్రే అలా పెళ్లికి సంబంధించిన డెసిషన్ తీసుకోవడంతో చాలామంది ఆమె ప్రేగ్నెంట్ కావచ్చు అందుకే తొందర పెళ్లి చేసుకుంది అంటూ ఒక రూమర్ ని కూడా తెరపైకి తీసుకోవచ్చారు.
కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు అని తెలుస్తుంది.ఇక అమలాపాల్ పెళ్లి చేసుకున్న రెండో భర్త బ్యాగ్రౌండ్ ఏంటి ఆయనకు ఎన్ని కోట్ల ఆస్తి ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.అమలాపాల్ రెండో పెళ్లి చేసుకున్న జగత్ దేశాయ్ (Jagath desai) అనే వ్యక్తి చాలా మంచివాడు అని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి.
ఇక అన్ని మంచి గుణాలు కలిగిన వాడినే అమలాపాల్ (Amala Paul) రెండో భర్తగా ఎంచుకుందని,గుణంలోనే కాదు ధనంలోనూ జగత్ దేశాయ్ టాప్ ప్లేస్ లో ఉన్నాడని, ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని దేశంలో ఉన్న టాప్ వ్యాపారవేత్తలలో ఈయన పేరు కూడా ఉంటుందని తెలుస్తోంది.అలాగే ఈయనకు కొన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయని,ఆ ఆస్తులన్నింటికీ జగత్ దేశాయ్ ఏకైక వారసుడు అంటూ కూడా నెట్టింట ప్రచారం జరుగుతుంది.ఇక ఈ లెక్కన అమలాపాల్ ధనం మాత్రమే కాదు గుణం ఉన్న వ్యక్తిని కూడా రెండవ భర్తగా ఎంచుకుందని, వీరి కాపురం చాలా ఆనందంగా సాగాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఏది ఏమైనప్పటికీ మొదటి పెళ్లి విషయంలోనే అమలాపాల్ కి అలా జరగడంతో రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తితోనైనా జీవితాంతం కలిసి ఉండాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.