దగ్గుబాటి ఫ్యామిలీ నుండి రామానాయుడు ( Rama naidu ) నిర్మాతగా ఎంతోమంచి గుర్తింపు సంపాదిస్తే ఆయన వారసులుగా ఇండస్ట్రీకి వచ్చిన వెంకటేష్,సురేష్ బాబు లు కూడా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.ఇక మూడోతరం వారసులుగా రానా ( Rana ) ఇప్పటికే ఇండస్ట్రీలో విభిన్న పాత్రలు పోషిస్తూ ముందుకు వెళ్తున్నారు.
ఈయన కేవలం హీరో గానే కాకుండా విలన్ గా కూడా అదరగొడతారు.అలాగే రానా నాయుడు అనే వెబ్ సిరీస్ తో నెగిటివ్ గానైనా చాలా ఫేమస్ అయ్యారు.
అయితే అలాంటి రాననా తన తండ్రితో గొడవ పడి దాదాపు నెల రోజులు మాట్లాడలేదట.మరి ఎందుకు వారిద్దరి మధ్య గొడవ వచ్చిందనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.
దగ్గుబాటి రానా సినిమాల్లోకి రాకముందు స్టార్ హీరోల సినిమాలకు విఎఫ్ఎక్స్ అందించేవాడు అనే సంగతి చాలా మందికి తెలుసు.
స్పిరిట్ మీడియా ( Spirit media ) అనే పేరుతో ఈయన విఎఫ్ఎక్స్ మీడియాని దాదాపు 18 సంవత్సరాల క్రితం నడిపాడు.
అయితే విజువల్ ఎఫెక్ట్స్ మీడియా పెట్టిన ఐదు సంవత్సరాలకే దాన్ని అమ్మేయాలి అని నిర్ణయించుకున్నారు.అయితే ఈ విఎఫ్ఎక్స్ మీడియాలో బాహుబలి వంటి పాన్ ఇండియా మూవీస్ ని కూడా తెరకెక్కించి సంచలనం సృష్టించాలి అని రానా ఎన్నో కలలు కన్నారట.
కానీ ఆయ విఎఫ్ఎక్స్ సంస్థను నడిపించే సమయంలో అలాంటి సినిమాలు తీయడానికి ఎవరు ముందుకు రాలేదట.
అయితే నాలుగు సంవత్సరాలు సక్సెస్ఫుల్గా రన్ చేసిన ఆ విఎఫ్ఎక్స్ సంస్థని ( VFX company )రన్ చేయడం తన వల్ల కాకపోవడంతో దాన్ని అమ్మేయాలి అని దగ్గుబాటి రానా అనుకున్నారట.అది ఏదో సరదాగా పెట్టుకున్న వ్యాపారం కాదని ప్రైమ్ ఫోకస్ వాళ్లకి అమ్మేశాడట.ఇక ప్రస్తుతం ప్రైమ్ ఫోకస్ ప్రపంచంలోనే పెద్ద విఎఫ్ఎక్స్ సంస్థగా మారింది.
అయితే రానా దగ్గుపాటి విఎఫ్ఎక్స్ కంపెనీని అమ్మేసే సమయంలో సురేష్ బాబుకి రానాకి మధ్య చాలా గొడవలు వచ్చాయట.
ఇక రానా కంపెనీ రన్ చేయడం నావల్ల కాదు అని అమ్మే సమయంలో సురేష్ బాబు ( Suresh babu ) రానా తో గొడవ పెట్టుకొని దాదాపు నెల రోజులపాటు ఇంట్లో సరిగ్గా మాట్లాడలేదు.దాంతో విసిగిపోయిన రానా అప్పుడప్పుడు ఇంటికి వెళ్లడం కూడా మానేశారట.కానీ అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తనకి కంపెనీని అమ్మేయడం తప్ప మరొక మార్గం కనిపించలేదని రానా ఈ మధ్యకాలంలో పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.
ఇక రానా స్పిరిట్ మీడియా సంస్థలో నిర్మించిన బొమ్మలాట అనే సినిమాకి రెండు నేషనల్ అవార్డ్స్ సైతం వచ్చాయి.కానీ ఈ సినిమా మాత్రం థియేటర్ లో విడుదల కాలేదు.