ఈయ‌నేంటి ర‌న్న‌ర్ల‌ను మించిపోయాడు.. ఇంత‌కీ ఎవ‌రాయ‌న..?

సాధారణంగా ప్రస్తుతం ఏ విషయమైనా డిజిటలైజ్ చేయడం మనం గమనించొచ్చు.ప్రభుత్వ ఆఫీసుల నుంచి మొదలుకుని ఇంటి వరకు ప్రతీ పని డిజిటల్ మోడ్‌లోనే జరుగుతుంది.

 How Many Runners Has He Surpassed Who Else Runner, Camera Man,social Media Vir-TeluguStop.com

కొవిడ్ సందర్భంగా పలు కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వగా, అది కూడా ఒకరకంగా డిజిటలైజేషనే.అనగా ప్రతీ పని డిజిటల్‌గా రికార్డు చేయడం వల్ల ఫ్యూచర్‌లో దాన్ని తిరిగి చూసుకోవచ్చు.

భద్రంగా కూడా ఉంటుంది.ఈ నేపథ్యంలో డిజిటల్ ఇండియా, డిజిటల్ వరల్డ్ అనే పదాలు వినబడుతుంటాయి.

ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే.చేసే ప్రతీ పని డిజిటల్ రికార్డు చేయాలని చెప్పడం కోసం.

చైనాలోని షాంగ్జి ప్రావిన్స్‌ డాటింగ్ యూనివర్సిటీ వంద మీటర్ల పరుగు పందెం డిజిటల్‌గా కెమెరాలో రికార్డు చేయడం కోసం ఓ కెమెరామెన్ చేసిన పని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు.ఇంతకీ అతడు ఏం చేశాడు? మీరే చదివి తెలుసుకోండి.

వంద మీటర్ల పరుగు పందెంలో క్రీడాకారుల పరుగు రికార్డు చేసేందుకు గాను రన్నర్ల కంటే వేగంగా పరిగెత్తాడు.తద్వారా ఆడియెన్స్ దృష్టి కొంత మేరకు క్రీడాకారులపైన కాకుండా అతడిపైన పడింది.సడెన్‌గా వచ్చి ట్విస్ట్ ఇచ్చాడు ఈ కెమెరామెన్ అని చెప్పొచ్చు.నిజానికి అతడు పోటీలో లేడు.కానీ, పోటీలో పాల్గొన్న వారందరి కంటే స్పీడ్‌గా పరిగెత్తుతూ మ్యాన్ ఆఫ్ ది యూనివర్సిటీ అనిపించుకున్నాడు.పోటీలో పాల్గొన్న క్రీడాకారులను వీడియో తీసేందుకు వారి కంటే ముందు పరిగెత్తుతూ వెళ్లాడు.

అది చూసి ఆడియెన్స్ షాక్ అయ్యారు.కెమెరామెన్ ప్రతిభావంతుడని చర్చించుకున్నారు.

అయితే, ఇలా కెమెరామెన్ పరిగెత్తడాన్ని మిగతా కెమెరామెన్లు రికార్డు చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు.అది కాస్తా సోష‌ల్ మీడియో‌లో ఒకరి నుంచి మరొకరికి పాకి ప్రస్తుతం ఫుల్ వైరల్ అవుతోంది.

గమ్యాన్ని క్రీడాకారుల కంటే ముందే కెమెరామెన్ చేరుకున్నాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి.ఆ కెమెరామెన్ సదరు యూనివర్సిటీ స్టూడెంటే.

కాగా, వీడియోగ్రాఫర్‌గాను పని చేస్తున్నాడు.అతడు కూడా పోటీల్లో పార్టిసిపేట్ చేయాల్సిందని, తద్వారా ఆయనకు బహుమతి లభించేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

https://youtu.be/3ZD_J1fZkdg
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube