దేవ దేవతలలో ప్రథమ పూజ్యుడిగా వినాయకుడిని పూజిస్తాము.మన విఘ్నాలను తొలగించి, శుభాలను కలిగిస్తాడు.
అయితే ఇప్పటివరకు కాణిపాకంలోని వరసిద్ధి వినాయకుడు ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం గురించి మనం తెలుసుకున్నాము.ఈ ఆలయంలో మనకి నచ్చిన వస్తువులను వదిలేసి ఆ దేవుడికి మన కోరిక తెలియజేయడంతో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని భక్తులు పెద్ద ఎత్తున విశ్వసిస్తారు.
అయితే ఈ ఆలయంలో కొలువై ఉన్న స్వామివారు రోజుకు కొంత పరిమాణంలో పెరుగుతున్నారని స్థానికులు చెబుతుంటారు.ఈ కాణిపాక వరసిద్ధి వినాయకుడి తరహాలోనే కేరళలోని మధుర్ గ్రామం శివాలయంలో ఉన్న వినాయక విగ్రహం కూడా పెరుగుతోందని అక్కడి స్థానిక ప్రజలు చెబుతున్నారు.
కేరళ బోర్డర్ లోని కసార్గాడ్ పట్నానికి అతి సమీపంలో మధుర్ మహాగణపతి అనే ఆలయం ఉంది.ఈ ఆలయంలో నిజానికి గణపతి బదులు మూలవిరాట్ శివుడు స్వయంభుడని చెబుతారు.
ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.పూర్వకాలంలో మధుర అనే ఒక మహిళ ముందుగా ఆ ప్రాంతంలో శివలింగం ఉండటం కనుగొన్నారు.
ఆ తర్వాత ఆ శివలింగం చుట్టే ఆలయాన్ని నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి.ఈ శివలింగాన్ని ముందుగా మధుర అనే మహిళ కనుగొనడం వల్ల ఈ ఆలయానికి మదుర్ మహాగణపతి ఆలయం అని పిలుస్తారు.

ఈఆలయంలోని స్వామి వారు ముందుగా ఒక మహిళకు దర్శనం ఇవ్వటం వల్ల ప్రతి రోజు తొలి దర్శనాన్ని మహిళకే కల్పించడం ఈ ఆలయ ప్రత్యేకత.అదేవిధంగా ఈ ఆలయ స్థలపురాణం ప్రకారం ఆలయ పూజారి పిల్లవాడు ఆలయానికి వచ్చారు.ఆ పిల్లవాడు ఆడుకుంటూ గర్భగుడిలోకి ప్రవేశించి వినాయకుడి బొమ్మ గీసాడు, ఈ క్రమంలోనే వినాయకుడి బొమ్మ నుంచి రూపం ఆవిర్భవించడం మొదలైంది.అంతేకాకుండా ఈ రూపం రోజురోజుకు పెరుగుతోందని భక్తులు విశ్వసిస్తారు.
ఈ విధంగానే పరమేశ్వరుడికి వినాయకుడికి కలిపి పూజలను నిర్వహిస్తారు.ఈ ఆలయంలోని వినాయకుడిని కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందని భక్తులు పెద్ద ఎత్తున విశ్వసిస్తుంటారు
.