తొలి దర్శనం మహిళలకు కల్పించే గణపతి ఆలయం ఎక్కడుందో తెలుసా?

దేవ దేవతలలో ప్రథమ పూజ్యుడిగా వినాయకుడిని పూజిస్తాము.మన విఘ్నాలను తొలగించి, శుభాలను కలిగిస్తాడు.

అయితే ఇప్పటివరకు కాణిపాకంలోని వరసిద్ధి వినాయకుడు ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం గురించి మనం తెలుసుకున్నాము.

ఈ ఆలయంలో మనకి నచ్చిన వస్తువులను వదిలేసి ఆ దేవుడికి మన కోరిక తెలియజేయడంతో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని భక్తులు పెద్ద ఎత్తున విశ్వసిస్తారు.

అయితే ఈ ఆలయంలో కొలువై ఉన్న స్వామివారు రోజుకు కొంత పరిమాణంలో పెరుగుతున్నారని స్థానికులు చెబుతుంటారు.

ఈ కాణిపాక వరసిద్ధి వినాయకుడి తరహాలోనే కేరళలోని మధుర్ గ్రామం శివాలయంలో ఉన్న వినాయక విగ్రహం కూడా పెరుగుతోందని అక్కడి స్థానిక ప్రజలు చెబుతున్నారు.

కేరళ బోర్డర్ లోని కసార్‌గాడ్ పట్నానికి అతి సమీపంలో మధుర్‌ మహాగణపతి అనే ఆలయం ఉంది.

ఈ ఆలయంలో నిజానికి గణపతి బదులు మూలవిరాట్ శివుడు స్వయంభుడని చెబుతారు.ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

పూర్వకాలంలో మధుర అనే ఒక మహిళ ముందుగా ఆ ప్రాంతంలో శివలింగం ఉండటం కనుగొన్నారు.

ఆ తర్వాత ఆ శివలింగం చుట్టే ఆలయాన్ని నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి.ఈ శివలింగాన్ని ముందుగా మధుర అనే మహిళ కనుగొనడం వల్ల ఈ ఆలయానికి మదుర్ మహాగణపతి ఆలయం అని పిలుస్తారు.

"""/" / ఈఆలయంలోని స్వామి వారు ముందుగా ఒక మహిళకు దర్శనం ఇవ్వటం వల్ల ప్రతి రోజు తొలి దర్శనాన్ని మహిళకే కల్పించడం ఈ ఆలయ ప్రత్యేకత.

అదేవిధంగా ఈ ఆలయ స్థలపురాణం ప్రకారం ఆలయ పూజారి పిల్లవాడు ఆలయానికి వచ్చారు.

ఆ పిల్లవాడు ఆడుకుంటూ గర్భగుడిలోకి ప్రవేశించి వినాయకుడి బొమ్మ గీసాడు, ఈ క్రమంలోనే వినాయకుడి బొమ్మ నుంచి రూపం ఆవిర్భవించడం మొదలైంది.

అంతేకాకుండా ఈ రూపం రోజురోజుకు పెరుగుతోందని భక్తులు విశ్వసిస్తారు.ఈ విధంగానే పరమేశ్వరుడికి వినాయకుడికి కలిపి పూజలను నిర్వహిస్తారు.

ఈ ఆలయంలోని వినాయకుడిని కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందని భక్తులు పెద్ద ఎత్తున విశ్వసిస్తుంటారు.

వామ్మో.. కూల్ డ్రింక్స్ తాగ‌డం వ‌ల్ల ఇన్ని జ‌బ్బులా..?