108.ఆపదలో ఉన్నప్పుడు గుర్తొచ్చే అత్యవసర ఫోన్ నెంబర్.యాక్సిడెంట్ అయినా.పాయిజన్ తీసుకున్నా.
పాము కరిచినా.ఆరోగ్య సమస్యలు తలెత్తినా.
వెంటనే 108కి కాల్ చేస్తాం.ఫోన్ చేసిన కాసేపటికే కుయ్ కుయ్ అంటూ స్పాటుకు చేరుకుంటుంది అంబులెన్స్.సకాలంలో ప్రమాద బాధితులను సమీప ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాణదాతగా నిలుస్తోంది.108 పుణ్యమా అని రాష్ట్రంలో వేల మంది ప్రాణాలు కాపాడబడ్డాయి.అయితే అత్యవస అంబులెన్స్ కు 108 నంబర్ ను ఎందుకు పెట్టారు? ఈజీగా ఉంటుందనా? లేక .ఆ నంబర్ వెనుక ఏదైనా కారణం ఉందా? అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
భారతదేశం అత్యధిక హిందూ జనాభా కలిగిన దేశం.భారతీయులకు 108 అనే సంఖ్య అత్యంత పవిత్రమైనది.అందుకే దేవుడికి కట్టే పూల పూలమాలలో సరిగ్గా 108 పువ్వులను ఉండేలా చూసుకుంటారు.ధ్యానం కోసం వాడే పూసలు పొదిగిన హారంలో కూడా 108 పూసలని ఉపయోగిస్తారు.
ఇక సూర్యుడు, చంద్రుడు, భూమి దూర వ్యాసం సరిగ్గా 108 సార్లు ఉంటుంది.ఇక యోగా శాస్త్రాల ప్రకారం దేశంలో 108 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.అంతేకాదు.ఉపనిషత్తులు, మర్మ స్థానాల సంఖ్య కూడా 108 కావడం విశేషం.ఇక ఇస్లాం మతంలో 108ను దేవుడితో పోలుస్తారు.సాధారణంగా మనిషి చనిపోయాక తన ఆత్మ 108 ఘట్టాలను దాటుకుని ప్రయాణం చేస్తుందని ముస్లీంల నమ్మకం.
ఇక సైకాలజి పరంగా కూడా 108కు ప్రత్యేకత ఉంది.
మనిషి డిప్రెషన్ లో ఉన్నప్పుడు వారి చూపు ఫోన్ లో ఎడమ భాగం వైపు చివరిగా వెళ్తుందట.అక్కడ 0,8 దగ్గరగా ఉంటాయి.అందుకే 108ని ఎమర్జెన్సీ నంబర్ గా ఎంపిక చేసి ఉండ వచ్చని తెలుస్తోంది.మొదటి సంఖ్య అయిన 1 మేల్ ను, 0 ఫిమేల్ ను సూచిస్తాయి.8వ సంఖ్య ఇన్ఫినిటీ, ఎటర్నిటిని సూచిస్తుందట.ఈ కారణాల అన్నింటి నేపథ్యంలో 108 సంఖ్య అంబులెన్స్ కు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.