ఒకసారి స్టార్డం వచ్చాక హీరోయిన్స్ అన్ని భాషల్లో నటించాలని తహతలాడిపోతూ ఉంటారు.ఇదేనా ఒక భాషలో హిట్ అయిన హీరోయిన్ ని మరో భాషలో ఇంటర్వ్యూ చేయడం కూడా మనవాళ్లకు బాగా అలవాటైన విషయమే.
అలా ప్రస్తుతం చాలామంది హీరోయిన్స్ మూడు భాషల్లో నటించాలని ఆరాటపడుతున్న అది కొంతమందికే సాధ్యమవుతుంది గతంలో పూజ హెగ్డే తెలుగు తమిళ్ హిందీ భాషల్లో నటించిన ఒక భాషలో కూడా సక్సెస్ కాకపోవడంతో ప్రస్తుతం ఫామ్ లో లేకుండా పోయింది.శృతి హాసన్, కాజల్ సైతం ఇలాగే ప్రయత్నించిన వారికి కూడా సరైన సక్సెస్ రాకపోవడంతో ఏదో ఒక భాషకే ఫిక్స్ అయిపోయారు.
ప్రస్తుతం కియారా అద్వాని( Kiara Advani ) మూడు భాషల్లో నటిస్తూ గోల్డెన్ హీరోయిన్ గా మారిపోయింది.తెలుగులో గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ సరసన నటిస్తున్న ఈ అమ్మడు హిందీలో హృతిక్ రోషన్ చేసిన వార్ 2 చిత్రంలో కూడా నటిస్తుంది.
కన్నడలో కూడా ఈ అమ్మడు డెబ్యూ చేయబోతోంది.
నిన్న మొన్నటి వరకు ఏ సినిమాలో ను కనిపించని సాయి పల్లవి( Sai Pallavi ) ఇప్పుడు బాగా బిజీ అయిపోయింది.తెలుగులో నాగచైతన్య తండేల్ సినిమాలో నటిస్తున్న సాయి పల్లవి హిందీలో నార్త్ రామాయణం అలాగే ఆమీర్ ఖాన్ కుమారుడు సినిమాలో కూడా నటిస్తుంది.ఇక తమిళ్లో శివ కార్తికేయన్ సరసన కూడా నటిస్తోంది.
లేటు వయసులో బాగా బిజీ అయిపోయింది త్రిష.( Trisha ) ప్రస్తుతం తెలుగులో చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తుంది.ఇక తమిళ్ లో అజిత్ సరసన నటిస్తూనే కమల్ హాసన్ తగ్ లైఫ్ చిత్రంలో కూడా నటిస్తుంది.అలాగే మలయాళం లో రామ్ మరియు ఐడెంటిటీ అనే రెండు సినిమాల్లో నటిస్తోంది త్రిష.
వరుస విజయాలు సాధించి అదే దోవలో వరుస పరాజయాలు చూసి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి మాయమైపోయింది కృతి శెట్టి.( Krithi Shetty ) ఇప్పుడు ఆమెను కోలీవుడ్ బాగానే ఆదుకుంది.
అక్కడ ఏకంగా మూడు సినిమాల్లో నటిస్తుంది.దానితో పాటు తెలుగులో మనమే అనే ఒక చిత్రంతో పాటు మలయాళం లో కూడా ఒక సినిమాలో నటిస్తుంది.
ఎన్ని విజయాలు ఉన్నాయో అన్ని పరాజయాలు కూడా ఉన్నాయి కీర్తి సురేష్( Keerthy Suresh ) కెరియర్లో.ఇప్పుడు తెలుగులో సుహాస్ తో ఒక చిత్రంలో నటిస్తున్న ఈ అమ్మడు తమిళంలో మూడు సినిమాల్లో నటిస్తుంది.అలాగే హిందీలో వరుణ్ ధావన్ సరసన కూడా ఒక చిత్రంలో నటిస్తుంది.
రష్మిక మందన కూడా తనేమీ తక్కువ తినలేదు.
తెలుగుతో పాటు తమిళ్, హిందీ చిత్రాలలో నటిస్తూ ఈ అమ్మడు గోల్డెన్ లెగ్ గా మారిపోయింది.