దివ్యాంగులకు 13 బైక్స్ ఇచ్చి మాట నిలబెట్టుకున్న రాఘవ లారెన్స్.. మనుషుల్లో దేవుడంటూ?

రాఘవ లారెన్స్( Raghava Lawrence ) గురించి సినీ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రాఘవ లారెన్స్ చేసిన సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని చెప్పవచ్చు.

 Raghava Lawrence Help To Needy People Details, Raghava Lawrence, Director Raghav-TeluguStop.com

ప్రధానంగా దివ్యాంగులు, అనాథ పిల్లల కోసం రాఘవ లారెన్స్ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.అయితే తాజాగా లారెన్స్ 13 మంది దివ్యాంగులకు ప్రయోజనం చేకూరేలా బైక్స్ కొనుగోలు చేసి వాటిని త్రీ వీలర్ బైక్స్ గా( Three Wheeler Bikes ) మార్చారు.

దివ్యాంగులకు ఇచ్చిన మాటను నిలెబెట్టుకున్న రాఘవ లారెన్స్ గ్రేట్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా మరి కొందరు ఆయన మనిషి రూపంలో పుట్టిన దేవుడని చెబుతున్నారు.తను చేసే మంచి పనుల ద్వారా రాఘవ లారెన్స్ ఎప్పటికప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తున్నారని నెటిజన్లు చెబుతున్నారు.

వృద్ధులు, అనాథలు, దివ్యాంగుల కోసం ట్రస్ట్ ఏర్పాటు చేసిన లారెన్స్ ఎంతోమందికి సేవలు అందిస్తున్నారు.

ఎంతోమంది చిన్నారులకు రాఘవ లారెన్స్ గుండె సంబంధిత శస్త్రచికిత్సలను( Heart Operations ) అందించారు.ప్రకృతి వైపరిత్యాల సమయంలో కూడా ఆయన తన వంతు సహాయం చేయడం జరిగింది.కొన్నిరోజుల క్రితం ఒక మహిళా డ్రైవర్ కు ఆటో కొని ఇచ్చిన లారెన్స్ తాజాగా వికలాంగులకు సహాయం చేయడం ద్వారా ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు.

సేవా కార్యక్రమాల కొరకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్న లారెన్స్ టాలెంట్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువే అవుతుందని నెటిజన్లు చెబుతున్నారు.ఈ వీడియో చూస్తూ ఎమోషనల్ అవుతున్నామని కొంతమంది నెటిజన్లు చెబుతున్నారు.లారెన్స్ చేసిన ట్విట్టర్ పోస్ట్ కు 6200కు పైగా లైక్స్ వచ్చాయి.లారెన్స్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా ఇతర భాషల్లో సైతం లారెన్స్ క్రేజ్ ను పెంచుకుంటూ ప్రశంసలు అందుకుంటున్నారు.

లారెన్స్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube