టాలీవుడ్ ఇండస్ట్రీలో హోమ్లీ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో స్నేహ ఒకరు.అయితే ఈ హీరోయిన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి గత కొన్ని రోజులుగా ఎన్నో పుకార్లు ప్రచారంలోకి వస్తుండగా ఆ వార్తలు ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతుండటం గమనార్హం.
స్నేహ ప్రసన్న మధ్య మనస్పర్ధలు వచ్చాయని వాళ్లిద్దరూ విడాకులు తీసుకోనున్నారని వైరల్ అయిన వార్తలు హాట్ టాపిక్ అయ్యాయి.
కోలీవుడ్ మీడియాలో ఈ మేరకు వార్తలు ప్రచారంలోకి వచ్చాయనే విధంగా స్నేహ విడాకులకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే ఈ వార్తలు మరీ ఎక్కువగా ప్రచారంలోకి రావడంతో స్నేహ పరోక్షంగా స్పందించి ఈ వార్తలకు సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.భర్తతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసి తమ మధ్య ఎలాంటి సమస్యలు లేవని ఆమె చెప్పకనే చెప్పేశారు.
తన భర్తతో తాను సంతోషంగానే ఉన్నానని ఆమె క్లారిటీ ఇచ్చేశారు.
విడాకుల వార్తలపై స్నేహ నుంచి స్పష్టత రావడంతో ఇకనైనా ఈ వార్తలు ఆగిపోతాయేమో చూడాల్సి ఉంది.స్నేహ రీఎంట్రీలో పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు.తనకు నచ్చే, నప్పే పాత్రలను మాత్రమే ఆమె ఎంచుకుంటున్నారు.
స్నేహ నటించిన వినయ విధేయ రామ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.
ఈ మధ్య కాలంలో స్నేహ పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు.అయితే తక్కువ సినిమాలే చేస్తున్నా యాడ్స్ లో మెరుస్తూ స్నేహ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.నటిగా స్నేహ తన స్థాయిని అంతకంతకూ పెంచుకుంటూ విజయవంతంగా కెరీర్ ను కొనసాగించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
స్నేహ తెలుగులో మళ్లీ ఆఫర్లతో బిజీ కావాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.స్నేహ రోజుకు పది లక్షల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.