ఫైర్ బ్రాండ్ రోజా ( Roja )గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.సినిమాల ద్వారా సోషల్ మీడియా ద్వారా, ఎమ్మెల్యేగా, మంత్రిగా రోజా పాపులారిటీని సంపాదించుకున్నారు.
రోజా సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఉన్నాయి.తెలుగు రాష్ట్రాలలో రోజా తెలియని వారు ఎవరూ ఉండరు.
అయితే బాలీవుడ్ నటి కంగనా రనౌత్( Kangana Ranau ) తాజాగా రోజా ఎవరో తెలియదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
చంద్రముఖి2( Chandramukhi 2 ) ప్రమోషన్స్ లో భాగంగా కంగనా రనౌత్ మీడియాతో ముచ్చటించారు.తాను పాలిటిక్స్ లోకి వస్తానని కంగనా చెప్పుకొచ్చారు.అయితే సినిమా వాళ్లు పాలిటిక్స్ లోకి రాకూడదని రోజా ఒక సందర్భంలో చెప్పగా ఆ కామెంట్లను కొంతమంది కంగనా రనౌత్ దృష్టికి తెచ్చారు.
ఆ సమయంలో కంగనా రనౌత్ మాట్లాడుతూ రోజా అనే వ్యక్తి ఉన్నారనే నాకు తెలియదని చెప్పుకొచ్చారు.
రోజా గురించి తాను కామెంట్ చేయాలని భావించడం లేదని కంగనా అభిప్రాయం వ్యక్తం చేశారు.పాలిటిక్స్ లోకి వచ్చే ఛాన్స్ వస్తే మాత్రం తాను వదులుకోనని ఆమె చెప్పుకొచ్చారు.దేశం పేరు మార్పు గురించి తాను రెండు సంవత్సరాల క్రితమే స్పందించడం జరిగిందని కంగనా అన్నారు.
తాను పేదలకు ఎంతో సహాయం చేశానని ఎంతోమంది పేదలను ఆదుకున్నానని కంగనా చెప్పుకొచ్చారు. కంగనా చేసిన వ్యాఖ్యలను కొంతమంది మీడియా మిత్రులు రోజా దృష్టికి తీసుకెళ్లారు.
అయితే కంగనా చేసిన కామెంట్ల గురించి రోజా సీరియస్ కాకుండా కూల్ గానే స్పందించారు.కంగనా రనౌత్ కు నేను ఎలా తెలుస్తానని ఆమె చెప్పినదానిలో తప్పేముందని రోజా పేర్కొన్నారు.
రోజా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.రోజా పొలిటికల్ గా మరింత సక్సెస్ కావాలని ఆమె అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.