సోషల్ మీడియా( Social media ) వేదికగా ఎంతోమంది ఒకరినొకరు పరిచయం చేసుకొని వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు.కొందరు కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహం చేసుకుంటే.
మరికొందరు కుటుంబ సభ్యులను ఎదిరించి ఇంటి నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకుంటున్నారు.వివాహం తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా కొందరు మాత్రమే ఆ కష్టాలకు ఎదురుగా నిలబడి తట్టుకుంటే.
మరికొందరు సమస్యలను తట్టుకోలేక పారిపోతున్నారు.

ఇలాంటి కోవలోనే ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) లో ఫేస్బుక్ ద్వారా పరిచయమై, పెళ్లితో ఒకటైన జంట అనుకోని కష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.వివరాల్లోకెళితే.ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం సీఎన్ పేట గ్రామానికి చెందిన యనమాల హరిబాబుకు ఫేస్బుక్ ద్వారా నంద్యాల జిల్లా పాణ్యం మండలం బలపనూరు గ్రామానికి చెందిన సుకన్యతో పరిచయం ఏర్పడింది.
ఇద్దరూ ఫేస్బుక్ ద్వారా చాటింగ్, ఫోన్ కాలింగ్ ద్వారా ప్రేమించుకున్నారు.రెండు నెలల కిందట ఈ ప్రేమికులు వివాహ బంధంతో ఒకటయ్యారు.దాదాపుగా ఒక నెల రోజుల పాటు యువతి అక్క ఇంట్లో తలదాచుకున్న ఆ జంట ఆ తర్వాత యువకుడి ఇంటికి వెళ్లారు.ఆ తరువాత హరిబాబుకు చెందిన ఆస్తిపాస్తులు అన్ని సుకన్య పేరుపై రాయాలని సుకన్య బంధువులు కోరారు.
హరి బాబుకు సోదరుడు కూడా ఉండడంతో ఆస్తిపాస్తులు ఇప్పుడే రాసి ఇవ్వడం కుదరదని హరిబాబు కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.

కానీ సుకన్య బంధువులు మాత్రం ఇప్పుడే ఆస్తి రాసి ఇవ్వాలంటూ రాడ్లు, కర్రలతో హరిబాబు కుటుంబం పై దాడి చేశారు.ఈ ఘటన చూస్తూ ఉన్నా గ్రామస్తులు కాసేపటి వరకు మౌనంగానే ఉన్నారు.కానీ యువతి బంధువులు విచక్షణారహితంగా హరిబాబు తో పాటు అతని కుటుంబ సభ్యులపై దాడి చేస్తూ ఉండడంతో గ్రామస్తులంతా తిరగబడ్డారు.
దీంతో సుకన్య బంధువులు అక్కడి నుంచి పరారయ్యారు.తీవ్రంగా గాయపడిన హరిబాబు ను, అతని కుటుంబ సభ్యులను ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు( police ) ఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.







