తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని దశాబ్దాలపాటు ఏకచ్ఛత్రాధిపత్యం నడిపించిన నందమూరి తారక రామారావు తెలుగు ప్రజలందరికీ ప్రేమగా పిలుచుకునే అన్న గా మారిపోయారు.ఇక పౌరాణిక పాత్రల్లో నటించి కనిపించి కృష్ణుడిగా రాముడిగా తెలుగు ప్రేక్షకులందరూ కూడా బ్రహ్మరథం పట్టే అంత క్రేజ్ సంపాదించుకున్నారు.
అయితే ఇక ఎన్టీఆర్ హీరో గొప్ప క్రేజ్ సంపాదించడమే కాదు ఒక మంచి మనిషిగా ఎంతో మంది హీరోలకు హీరోయిన్లకు మార్గదర్శిగా నిలిచారు.కష్టం వచ్చినప్పుడు నేను ఉన్నాను అంటూ భరోసా ఇచ్చారు.
ఇక ఇలా ఎన్టీఆర్ సలహాలతో ఎంతో మంది హీరో హీరోయిన్లు ఆస్తులు సంపాదించుకున్న వారు ఉన్నారు అని చెప్పాలి.
అయితే ఒక్క హీరోయిన్ కు కూడా ఇక భవిష్యత్తులో బాగా సెటిల్ అవ్వాలని ఉద్దేశంతో అన్నగారు ఒక మంచి సలహా ఇచ్చారట.
అన్న గారు ఇచ్చిన సలహాను మాత్రం పెడచెవిన పెట్టిన హీరోయిన్ ఆ తర్వాత మాత్రం ఎన్నో ఆర్థిక కష్టాలు కొని తెచ్చుకుంది అన్నది అప్పట్లో ఇండస్ట్రీలో సంచలనంగా మారిపోయింది.ఇక ఇప్పుడు ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
అన్న గారి మాటలు పెడచెవిన పెట్టిన హీరో ఎవరో కాదు కాంచన. సావిత్రి అంజలీదేవి కాలంలో బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయమై ఆ తర్వాత హీరోయిన్ గా కూడా రాణించింది కాంచన.
ఇక అందరికీ ఇచ్చినట్లుగానే ఆమెకు కూడా భవిష్యత్తులో ఆస్తులు కూడబెట్టుకున్న కొన్ని సలహాలు ఇచ్చాను అన్న గారు.

ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులను కూడా ఎక్కువగా నమ్మవద్దని సినిమా వాళ్ళతో ఎంత వరకు ఉండాలో అంత వరకే ఉండాలని అంతే కాకుండా ఇక సంపాదించిన దాంట్లో కొంత మొత్తం వెనకేసుకోవాలి అంటూ అన్నగారు అప్పట్లో సూచించారట.అయితే ప్రతి ఒక్కరూ అన్న గారు చెప్పిన మాటలు తూచా తప్పకుండా పాటిస్తే కాంచన మాత్రం మితిమీరిన దానధర్మాలు చేయడం చేసేవారట.ఇక కొడుకులకు పూర్తిగా స్వాతంత్రం ఇవ్వటం.
తన ఆర్థిక విషయాల్లో కూడా భర్తకు స్వేచ్ఛ ఇచ్చారట.అయితే ఆ తర్వాత కాలంలో సినిమా అవకాశాలు తగ్గడంతో ఇక ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి.

ఈ విషయం తెలుసుకున్న అన్నగారు హైదరాబాద్ లో ఒక స్థలాన్ని ఉచితంగా ఇస్తారు అని రమ్మని పిలిచారు.కానీ ఆమె మాత్రం అన్నగారి ఆహ్వానాన్ని తిరస్కరించారు.అప్పటికే అన్న గారు చెప్పింది వినక నష్టపోయానని భావించి ఇక అన్న గారికి ఇచ్చిన ఆహ్వానాన్ని కూడా తిరస్కరించినట్లు తెలుస్తోంది.ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన కొన్ని సినిమాలలో కాంచన కు అన్న గారు స్వయంగా ఆ దర్శకుడితో మాట్లాడి అవకాశం కల్పించి రెమ్యూనరేషన్ కూడా ఇచ్చే ఆర్థిక సమస్యల నుంచి ఆమెను బయట పడేసారు అన్నది తెలుస్తుంది.
ఈ విషయాన్ని కొన్ని ఇంటర్వ్యూలలో కాంచన చెప్పుకొచ్చారు.