ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది.దాదాపుగా రూ.150 కోట్ల నష్టాలను ఆ సినిమా చవి చూసింది అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.భారీ నష్టాలతో సినిమా ప్రభాస్ ఇమేజ్ ను భారీ గానే డ్యామేజీ చేసింది.దాంతో ఇప్పుడు ప్రభాస్ అభిమానుల దృష్టి అంతా కూడా ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో రూపొందుతున్న సలార్ సినిమా పై ఉంది.
సలార్ భారీ విజయాన్ని సొంతం చేసుకుని ప్రతి ఒక్కరితో కూడా వావ్ అనిపించుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.ప్రతి ఒక్కరు ఈ సినిమా విజయం పై నమ్మకంతో ఉన్నారు.
కే జి ఎఫ్ 2 సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రశాంత్ ఆ వెంటనే ప్రభాస్ హీరోగా సలార్ సినిమా ను ముగిస్తాడు.ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తి అయినట్లుగా ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆ ఇంటర్వ్యూలో దర్శకుడు మాట్లాడుతూ సినిమా పై వస్తున్న పుకార్ల కు క్లారిటీ ఇచ్చాడు.మొదటి నుండి కూడా ఈ సినిమా కన్నడం లో రూపొందిన ఒక సినిమా కు సంబంధించిన కథ తో రూపొందుతుందని అఫిషియల్ గా కాకుండా అనధికారికంగా పూర్తిగా ఆ సినిమా కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది కన్నడ మీడియాలో మరియు జాతీయ మీడియాలో కూడా పుకార్లు షికార్లు చేశాయి.
దాంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ ఏ ఒక్క సినిమా కు ఇది కాపీ కాదని.రీమేక్ కాదని క్లారిటీ ఇచ్చాడు.
ఖచ్చితం గా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా భారీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ను అందిస్తుంది అంటూ ప్రభాస్ అభిమానులకు ఆయన హామీ ఇచ్చాడు.ఇది డబ్బింగ్ సినిమా.
రీమేక్ సినిమా కానేకాదని అభిమానులు ఆ విషయం లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ ఆయన హామీ ఇచ్చాడు.ప్రశాంత్ హామీతో అభిమానులు కాస్త ఊరట చెందుతారు.







