టాలీవుడ్ ఇండస్ట్రీలో సోషల్ మీడియాకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని హీరోలలో నాగచైతన్య ముందు వరసలో ఉంటారు.ఈ స్టార్ హీరో వీలైనంత వరకు వివాదాలకు సైతం దూరంగా ఉంటారు.
అయితే నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల మధ్య ఏదో ఉందనే ప్రచారం మాత్రం కొత్త కాదు.వీళ్లిద్దరి మధ్య ఇష్టం ఉందో లేదో కచ్చితంగా చెప్పలేం కానీ అక్కినేని ఫ్యాన్స్ మాత్రం భవిష్యత్తులో చైతన్య శోభిత నుంచి ఏదైనా ప్రకటన రావచ్చని భావిస్తున్నారు.
తాజాగా నాగచైతన్య సోషల్ మీడియాలో ఒక సాధారణ ఫోటోను పంచుకోగా చైతన్య ఫోటో పోస్ట్ చేసిన కొన్ని క్షణాల్లోనే శోభిత లైక్ చేయడం గమనార్హం.సూర్యాస్తమయాన్ని ఎంజాయ్ చేస్తున్న ఫోటోను నాగచైతన్య పంచుకోగా శోభిత ఆ ఫోటోకు లైక్ చేయడంతో ఆ ఫోటో ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.
గతంలో లండన్ లో నాగచైతన్య చెఫ్ తో కలిసి ఫోటో దిగగా బ్యాగ్రౌండ్ లో శోభిత కనిపించిన సంగతి తెలిసిందే.సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య సింగిల్ గా ఉంటున్నాడు.నాగచైతన్య రెండో పెళ్లి గురించి చాలా సందర్భాల్లో వార్తలు వైరల్ అయినా అవి కేవలం గాసిప్స్ మాత్రమేనని తర్వాత రోజుల్లో క్లారిటీ వచ్చింది.శోభిత, చైతన్య నిజంగా ప్రేమలో ఉంటే ఆ విషయాన్ని వెల్లడిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఒకవేళ తమ మధ్య ఏం లేకపోతే పూర్తిస్థాయిలో క్లారిటీ ఇస్తే బాగుంటుందని అభిమానులు చెబుతున్నారు.
నాగచైతన్య ప్రస్తుతం సాయిపల్లవితో కలిసి తండేల్ సినిమాలో నటిస్తున్నారు.ఈ కాంబినేషన్ లో ఈ సినిమా రెండో సినిమా కావడం గమనార్హం.లవ్ స్టోరీ తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ కావడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.
విడిపోయిన తర్వాత చైసామ్ ఒకే వేదికపై కనిపించిన సందర్భాలు సైతం చాలా తక్కువనే సంగతి తెలిసిందే.సామ్ కూడా త్వరలో కెరీర్ పరంగా బిజీ కావడానికి ప్రయత్నిస్తున్నారు.