పక్క రాష్ట్రం థియేటర్ లో కూడా 100 రోజులు ఆడిన గుంటూరు కారం.. మహేష్ రేంజ్ ఇదే!

ప్రస్తుత కాలంలో ఎంత పెద్ద హిట్ సినిమా అయినా 100 రోజుల పాటు థియేటర్లలో ఆడటం సులువైన విషయం కాదు.యునానిమస్ పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలు మాత్రమే కొన్ని థియేటర్లలో 100 రోజులు ఆడటం హాట్ టాపిక్ అవుతోంది.

 Mahesh Babu Guntur Kaaram 100 Days Centres Details Here Goes Viral In Social Med-TeluguStop.com

వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు కొన్ని థియేటర్లలో 100 రోజులు ఆడి( 100Days in Theaters ) వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.అయితే మహేష్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన గుంటూరు కారం మూవీ( Guntur Kaaram ) రెండు థియేటర్లలో 100 రోజులు ఆడి సంచలనం సృష్టించింది.

గుంటూరు కారం సినిమా ఏపీలోని ఒక థియేటర్ లో 100 రోజులు ఆడగా కర్ణాటక రాష్ట్రంలోని ఒక థియేటర్ లో కూడా 100 రోజులు ఆడటం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. ఏపీలోని చిలకలూరిపేట( Chilakaluripeta )లో ఉన్న వెంకటేశ్వర థియేటర్ తో పాటు కర్ణాటక రాష్ట్రంలోని ముల్భాగల్ థియేటర్( Mulbagal Theatre Karnataka ) లో సైతం 100 రోజులు ఆడింది.

-Movie

ఏపీలో ఈ సినిమా 100 రోజుల పాటు ఆడటంలో ఆశ్చర్యం లేదు కానీ కర్ణాటకలో ఆడిందంటే గ్రేట్ అని సినీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu )కు ఉన్న క్రేజ్ వల్లే ఆయన నటించిన యావరేజ్ సినిమాలు సైతం 100 రోజులు ఆడుతున్నాయని ఫ్యాన్స్ చెబుతున్నారు.మహేష్ బాబు సినిమాలకు హిట్ టాక్ వస్తే ఇంకెన్ని థియేటర్లలో 100 రోజులు ఆడుతుందో చూడాలి.ప్రస్తుత కాలంలో సినిమాను ఆడించడం కూడా సులువైన విషయం కాదు.

ఓటీటీలో( OTT ) అందుబాటులో ఉన్న సినిమా ఇన్నిరోజులు థియేటర్ లో ఆడటం సాధారణ విషయం అయితే కాదు.

-Movie

గత కొన్నేళ్లుగా మహేష్ బాబు నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది.సర్కారు వారి పాట( Sarkaru Vaari Pata ), గుంటూరు కారం సినిమాలు నిర్మాతలకు నష్టాలను మాత్రం మిగల్చలేదు.మహేష్ సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే ఈ హీరో ఖాతాలో మరిన్ని బ్లాక్ బస్టర్ హిట్లు చేరతాయని చెప్పడంలో సందేహం అవసరం లేదని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube