రిపబ్లిక్ డే కానుకగా 'వీరమల్లు' భారీ ట్రీట్.. మేకర్స్ కన్ఫర్మ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో మొదటిసారి పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్నాడు.ఇక ఈ సినిమా కోసం ఈయన చాలానే కష్టపడుతున్నాడు.

 Hari Hara Veera Mallu Teaser Update , Pawan Kalyan, Hari Hara Veera Mallu, Direc-TeluguStop.com

యాక్షన్ ఎపిసోడ్స్ చాలానే ఉండడంతో పవన్ కూడా ఫుల్ ఫోకస్ తో యాక్షన్ ఎపిసోడ్ లను పూర్తి చేస్తున్నాడు.మరి ఆ సినిమా ఏంటో ఇప్పటికే తెలిసింది కదా.అదే ”హరిహర వీరమల్లు”.

ఈ సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

గత రెండేళ్ల నుండి షూటింగ్ జరుపు కుంటూనే ఉన్న మధ్యలో చాలా వాయిదాలు పడింది.దీంతో ఇప్పటికి షూట్ పూర్తి చేసుకోలేక పోయింది.

అయితే ఈ మధ్య క్రిష్ వేగంగానే షూట్ పూర్తి చేస్తున్నాడు.భారీ పాన్ ఇండియా మూవీగా అత్యుత్తమ సాంకేతిక విలువలతో హై బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఇప్పటికే రెండు గ్లిమ్స్ టీజర్స్, పోస్టర్ వంటివి రిలీజ్ అయ్యాయి.

ఈ అప్డేట్స్ అన్ని పవన్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టు కుంటాయి.అయితే తాజాగా నిర్మాత ఏ ఎం రత్నం ఈ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.ఈ అప్డేట్ పవన్ ఫ్యాన్స్ ను బాగా సంతోష పరిచింది.ఈ సినిమా టీజర్ రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న రాబోతుందని కన్ఫర్మ్ చేసారు.దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్టు తెలుస్తుంది.

ఇక ఏ ఎం రత్నం భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో రాబిన్ హుడ్ లాంటి పాత్రలో నటించ బోతున్నాడు.బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ అలాగే నర్గీస్ ఫక్రి కూడా ఈ సినిమాలో మెరవనున్నారు.

ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఎలాగైనా ఈ సమ్మర్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ పట్టుదలగా ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube