కడప జిల్లా లోని దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో జనవరి 22 నుంచి 30వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం వెల్లడించారు.ఉత్సవాల సందర్భంగా ఆయన దేవాలయాన్ని సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల పోస్టుర్ ను ఆయన ఆవిష్కరించారు.అంతే కాకుండా దేవాలయ జేఈవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు జనవరి 21న అంకురార్పణ జరుగుతుందని వెల్లడించారు.ప్రధానంగా 26వ తేదీ గరుడసేవ, 28వ తేదీన రథోత్సవం జరుగుతాయని వెల్లడించారు.జనవరి 31న పుష్పయాగం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు.
టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు రథం పటిష్టతను పరిశీలించారని వెల్లడించారు.అన్నమయ్య జిల్లా లోని తాళ్లపాక 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద రూ.50 లక్షల తో జరుగుతున్న శ్రీవారి కొత్త దేవాలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.రూ.45 లక్షలతో చేపడుతున్న అన్నమయ్య విగ్రహం వద్ద కొత్త వేదిక, రోడ్ల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి దేవాలయంలో ధ్వజస్తంభం పనులు, ఎలక్ట్రికల్, సివిల్ పనులు భక్తులకు తాగునీటి సౌకర్యం, పుష్కరిణి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.
ఒంటి మిట్ట శ్రీ కోదండ రామాలయం లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు ఆయన చాలా సూచనలు కూడా చేశారు.దేవాలయ జేఈవో వెంట డిప్యూటీ ఈవో నటేష్ బాబు, విజివో మనోహర్, డిఈ చంద్రశేఖర్ ఇంకా తదితరులు పాల్గొన్నారు.