కూతురికి తండ్రి అనేవాడు ఒక మార్గదర్శి.ప్రతి అడుగులో తోడంటూ తన కూతురు ఒక ఇండిపెండెంట్, స్ట్రాంగ్ గర్ల్‌గా మారడంలో తండ్రి కీలక పాత్ర పోషిస్తాడు.
తన కూతురు ఏ సందర్భంలోనూ ఆత్మనూన్యతకు లోనుకాకుండా ఆమెలో ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్‌ను నింపుతాడు.అందుకే తండ్రి అంటే కూతుర్లకు చచ్చేంత ప్రేమ ఉంటుంది.
వీరి ప్రేమకు నిదర్శనంగా నిలిచే వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.వీటిని చూస్తే ఎవరైనా సరే ఫిదా కావాల్సిందే.
తాజాగా అలాంటి ఒక వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, ఒక స్కూల్‌లో డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతోంది.
పిల్లలు చిలీ సంప్రదాయ డ్యాన్స్ చేస్తూ కనిపించారు.అయితే ఈ పిల్లలలో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి నాట్యం చేశారు.
ఒక్క విద్యార్థినికి తప్ప ఈ పిల్లలందరికీ డ్యాన్స్ పార్ట్‌నర్లు ఉన్నారు.నిజానికి ఆ విద్యార్థినికి కూడా ఒక డ్యాన్స్ పార్ట్‌నర్ ఉన్నాడు.
కాకపోతే ఆ స్టూడెంట్ స్కూల్‌కి రాలేదు.దాంతో ఆ బాలిక ఒంటరిగా స్టెప్స్ చేస్తూ కనిపించింది.
అందరికీ డ్యాన్స్ పార్ట్‌నర్లు ఉన్నారని తనకు మాత్రం లేరని చాలా అసంతృప్తిగా ఆ బాలిక కాలు కదిపింది.అయితే తన కుమార్తె డ్యాన్స్ పార్ట్‌నర్ రాకపోవడాన్ని తండ్రి గమనించాడు.
అనంతరం అతడు స్టేజ్ మీదకు వచ్చి తన కూతురితో నాట్యం చేస్తూ ఆమెలో చాలా సంతోషాన్ని నింపాడు.

ఈ తండ్రీకూతుర్లు స్టేజ్‌పై డ్యాన్స్ చేస్తుండగా విద్యార్థులందరూ చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేశారు.దాంతో స్కూల్ మొత్తం మార్మోగిపోయింది.ఈ హ్యాపీ మూమెంట్స్ చూసి ఆ చిన్నారి మరింత ఖుషి అయ్యింది.
వీరిద్దరూ డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.అది ఇప్పుడు వైరల్ అవుతుంది.ఈ వీడియో చూసిన నెటిజన్లు చాలా ఎమోషనల్ అవుతున్నారు.ఈ అద్భుతమైన క్షణాలను ఆ బాలిక ఎప్పటికీ మర్చిపోదని ఒక యూజర్ కామెంట్ చేశారు.
కూతురి జీవితంలో ఆనందాన్ని తెచ్చే తండ్రి అంటే ఇతడే అని, బెస్ట్ డాడ్ అని నెటిజనులు ఈ తండ్రిని తెగ పొగిడేస్తున్నారు.ఈ వీడియోని మీరు కూడా తిలకించండి.







