Male Goats : పాలిస్తున్న మగ మేకలు..క్యూ కట్టిన జనం

సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి రోజూ ఏదోక కొత్త విషయం వెలుగులోకి వస్తోంది.తాజాగా మరో ఆశ్చర్యకరమైన ఘటన నెట్టింట వైరల్ అవుతోంది.

 Male Goats Giving Milk ,goat, Viral Latest, News Viral, Social Media, Viral Late-TeluguStop.com

ఇదొక వండర్ అనే చెప్పాలి.సాధారణంగా మనం ఆడ ఆవులు, మేకలు పాలు ఇవ్వడం చూశాం కదా.అయితే ఇక్కడొక చోట మగ మేక పాలు ఇస్తోంది.ఇది తెలిసి కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు.

ఒక మగ మేక కాదండోయ్ మరికొన్ని మగ మేకలు కూడా పాలు ఇస్తున్నాయి.ప్రతి రోజూ కూడా ఒక్కో మగ 300 మిల్లీ లీటర్ల పాలను ఇస్తుండటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

గత రెండు సంవత్సరాలుగా మగ మేకలు పాలు ఇస్తుండటం చర్చనీయాంశమైంది.మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బుర్హాన్ పూర్ జిల్లాలో ఒక ప్రైవేటు మేకల పెంపకం కేంద్రం ఉంది.

అందులో చాలా మేకలు ఉన్నాయి.మేకల పెంపకం కేంద్రంలో మేకపోతులు పాలు ఇవ్వడం చూసి యజమాని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

విషయం చుట్టుపక్కల వారికి కూడా తెలియడంతో మేకల పెంపకం కేంద్రం వద్దకు బారులు తీరారు.వింతను చూసేందుకు జనం ఎగబడ్డారు.

పోలీసులు కూడా రంగంలోకి దిగి వింతను పరిశీలించారు.మేకపోతులు పాలివ్వడంపై జంతు శాస్త్ర వేత్తలు కూడా పరిశోధనలు మొదలెట్టారు.

పాలిచ్చే ఈ మేకపోతుల ధర లక్షల్లో ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఈ మేకలన్నీ కూడా రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన జాతి మేకలని యజమాని తెలియజేశారు.

మేకపోతులు పాలు ఇవ్వడం చాలా మందికి వింతగా అనిపించి అక్కడికి రావడం మొదలు పెట్టారు.రైతులు, పర్యాటకులు, పరిశోధకులతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోతోంది.

రోజూ అక్కడికి చాలా మంది వచ్చి మేకపోతులు పాలివ్వడం చూసి వెళ్తున్నారు.ఇటువంటి రకం పాలు ఆరోగ్యానికి మంచిదని మరికొందరు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube